Corona New Variant Jn.1: వెంటాడుతున్న కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1, 24 గంటల్లో ఎన్ని కేసులంటే..
Corona New Variant Jn.1: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి భయపెడుతోంది. కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు దేశంలో క్రమక్రమంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Corona New Variant Jn.1: సింగపూర్ దేశంలో విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 ఇతర దేశాలకు సైతం వ్యాపిస్తోంది. ముఖ్యంగా ఇండియాలో కలకలం రేపుతోంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
దాదాపు ఏడాదిన్నరగా కరోనా మహమ్మరి అంతమైందని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మరో కొత్త వేరియంట్ బయలుదేరింది. సింగపూర్ సహా ఇతర దేశాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ఇండియాలో సైతం ప్రవేశించిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు 63 నమోదయ్యాయి. గోవాలో అత్యదికంగా 34 ఉంటే మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో 2 ఉన్నాయి. కోవిడ్ కొత్త వేరియంట్ సంక్రమణ నేపధ్యంలో నీతి ఆయోగ్ అధికారులు ఇప్పటికే వివిధ రాష్ట్రాల అధికారులతో మాట్లాడారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరీక్షల సంఖ్య పెంచాల్సిన అవసరముందని చెప్పారు. మరోవైపు సంక్రమణను నియంత్రించేందుకు నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు.
దేశంలో జేఎన్.1 కొత్త వేరియంట్ కేసులు పెరుగుతున్నా సరే..అందులో 92 శాతం మంది ఇంట్లోనే చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఆసుపత్రి ఇన్‌పేషెంట్ల సంఖ్య పెరగడం లేదని వైద్యులు అంటున్నారు. పండుగ సీజన్ కావడంతో కోవిడ్ 19 మార్గదర్శకాల్ని తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. వ్యాధి సంక్రమణ పెరిగే ప్రమాదాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరింది.
కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసుల్ని ముందుగా గుర్తించేందుకు అవసరమైన అన్ని పరీక్షలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. దేశంలో ఒక్కరోజే 628 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేలకు చేరుకుంది. కేరళలో గత 24 గంటల వ్యవధిలో ఒకరు కరోనా కారణంగా మరణించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook\