Covid Symptoms in Teeth: కరోనా మహమ్మారి ఇప్పటికే మూడు దశల్లో ప్రపంచదేశాలను కలవరానికి గురిచేసింది. ఇప్పుడు ఫోర్త్ వేవ్ (నాలుగోసారి) అంటూ చైనా సహా యూరప్, ఆసియా దేశాల్లో కరోనా వైరస్ క్రమంగా వ్యాపిస్తుంది. దీంతో ఆయా దేశాల్లో కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు నాలుగో దశలో కరోనా సోకిన వారిలో వివిధ లక్షణాలు బయటపడుతున్నట్లు తేలింది. ఈసారి దంతాలపై కూడా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దంతాలను రక్షించుకోవాలి..


కరోనా వైరస్ అనేది శ్వాసకోశాల మీద ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తీవ్రమైన జ్వరం, దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు కరోనా బారిన పడిన వారిలో కనిపిస్తాయి. అయితే ఇప్పుడు కరోనా సోకిన వారిలో శరీరంలో ఇతర భాగాల్లోనూ లక్షణాలు కనిపిస్తున్నాయి.


ఇప్పుడు దంతాల చిగుళ్లపై కూడా కరోనా ప్రభావం చూపుతోందని పరిశోధకులు అంటున్నారు. దాన్ని కోవిడ్ టీత్ అని వాళ్లు పేరు పెట్టారు. ప్రస్తుతం కరోనా బారిన పడిన వారిలో చాలా మంది దంతాలపై ఉన్న చిగుళ్ల సమస్యలు కనిపిస్తున్నాయని వారు స్పష్టం చేశారు. 


కరోనా వైరస్ దంతాల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసినప్పుడు.. కరోనావైరస్ యొక్క కొన్ని లక్షణాలు నోటిలో ఉంటాయి. అలాంటి సంకేతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. వెంటనే కోవిడ్-19 పరీక్ష చేయించుకోండి. ఈ కింది లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి.


1. చిగుళ్ళలో నొప్పి


2. దవడ లేదా పంటిలో నొప్పి


3. చిగుళ్లలో రక్తం గడ్డకట్టడం


4. జ్వరం


5. దగ్గు


6. అలసట


(నోట్: పైన పేర్కొన్న సమాచారం కొన్ని నివేదికల ఆధారంగా సేకరించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మంచిది. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.) 


Also Read: Dangerous Fruit Combinations: అరటిపండుతో పాటు ఈ ఫ్రూట్ కలిపి తింటే ఇక అంతే సంగతులు!


Also Read: Detox Drinks Benefits: శరీరంలో వ్యర్థాలను, మలినాలను తొలగించుకునేందుకు ఈ డ్రింక్స్ తాగండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.