Covid19 in india: చాపకిందనీరులా విస్తరిస్తున్న కరోనా మహమ్మారి, 24 గంటల్లో 1600 కేసులు
Covid19 in india: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమ క్రమంగా పెరుగుతోంది. కరోనా వైరస్ కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. గత 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య మరింతా పెరిగింది.
Covid19 in india: కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాచేందుకు సిద్ధమౌతోంది. చాపకింద నీరులా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య 1590 కేసులు నమోదయ్యాయి. గత 146 రోజుల్లో ఇదే అత్యధికం. కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య దేశంలో ఇప్పుడు 8,601కు చేరుకుంది.
కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా మహమ్మారి విషయంలో 8 కీలక అంశాలు వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా మరణించినవారి సంఖ్య ఇప్పటి వరకూ 5,30,824 కు చేరుకుంది. గత 24 గంటల్లో మరో ఆరుగురు మరణించారు. మహారాష్ట్రలో 3, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రోజువారీ పాజిటివ్ రేటు 1.33 శాతం శాతం పెరిగింది. వీక్లీ పాజిటివ్ రేటు 1.23 శాతానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 220.65 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ జరిగింది.
ఇండియాలో 2020 ఆగస్టు నెలలో కరోనా వైరస్ రోగుల సంఖ్య 20 లక్షలు కాగా, 23 ఆగస్టు నాటికి 30 లక్షలకు చేరుకుంది. సెప్టెంబర్ నాటికి 40 లక్షలు దాటేసింది. 2020 సెప్టెంబర్ నాటికి 50 లక్షలు, సెప్టెంబర్ 28 నాటికి 60 లక్షలు అలా పెరుగుతూ పోయింది. డిసెంబర్ నాటికి ఈ సంఖ్య కోటి దాటేసింది. మే 2021 నాటికి సంక్రమిత రోగుల సంఖ్య 2 కోట్లకు చేరుకాగా జూన్ 23, 2021 నాటికి మూడు కోట్లు దాటేసింది. గత ఏడాది అంటే 2022 జనవరి నాటికి ఈ సంఖ్య 4 కోట్లు దాటింది.
Also read: Weight Gain During Pregnancy: గర్భిణీ స్త్రీలు క్రమంగా ఇలా బరువు పెరిగితే ప్రమాదమే, ఎందుకో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook