ప్రపంచాన్ని భయపెడుతున్న కోవిడ్ కొత్త వేరియంట్ బీఎఫ్.7పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వ్యాక్సిన్ బూస్టర్ డోసుపై ప్రచారంతో పాటు అవసరమైన పరీక్షలు ముమ్మరం చేయాలని రాష్ట్రాలకు సూచించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చైనా సహ ప్రపంచదేశాల్ని కోవిడ్ 19 మహమ్మారి మరోసారి భయపెడుతుండటంతో ఇండియా అప్రమత్తమైంది. దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షలు క్రమంగా పెంచుతున్నారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 226 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇది రోజువారీ పాజిటివిటీ రేటును 0.12కు చేర్చింది. శుక్రవారం అంటే డిసెంబర్ 31న కొత్తగా 243 కేసులు నమోదయ్యాయి. 2020 నుంచి ఇప్పటివరకూ కరోనా వైరస్ సోకినవారి సంఖ్య 4, 46,78,384కు చేరుకుంది. ఇందులో 4,41, 44, 029 మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో 179 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. 


రోజువారీ కోవిడ్ పాజిటివిటీ రేటు 0.12కు చేరుకోగా, వీక్లీ రేటు 0.15కు చేరుకుంది. మొత్తం 5,30,702 మంది కరోనాతో మరణించారు. దేశంలో గత 24 గంటల్లో 1,87,983 కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకైతే 91.07 కోట్ల పరీక్షలు జరిగాయి. ఇక దేశవ్యాప్తంగా జరిగిన వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ఇప్పటి వరకూ 220.10 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. 


గత 24 గంటల్లో 91,732 డోసులు వ్యాక్సిన్ ఇచ్చారు. కోవిడ్ 19 వైరస్ కేసులు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న నేపధ్యంలో చైనా, హాంగ్‌కాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్ దేశాల్నించి ఇండియాకు వచ్చేవారిపై ప్రయాణ ఆంక్షలున్నాయి. ఆ దేశాల్నించి బయలుదేరేముందు విధిగా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకుని ఆ రిపోర్ట్ ఎయిర్ సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. కొత్త ఏడాది అంటే జనవరి 1, 2023 నుంచి ఇది అమల్లో రానుంది. 


దేశానికి రానున్న 40 రోజులు అత్యంత కీలకంగా మారనున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికే హెచ్చరించింది. జనవరి మధ్య నాటికి దేశంలో కోవిడ్ కేసులు భారీగా పెరగవచ్చని అంచనా. ఈ అంచనా గత రెండేళ్ల గణాంకాల ఆధారంగా విశ్లేషించారు. 


Also read: Hangover Home Remedies: పార్టీ తర్వాత హ్యాంగోవర్‌ అయిందా.. ఈ 5 సహజసిద్ధమైన హోం రెమెడీస్‌తో ఇట్టే తగ్గిపోతుంది!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook