Cucumber Juice Benefits: సమ్మర్‌లో దోసకాయ రసాన్న ప్రతి రోజు తాగితే..శరీరంలో జరిగే అద్భుతమే!
Cucumber Juice On Empty Stomach: దోసకాయ రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. వేసవిలో శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది.
Cucumber Juice On Empty Stomach: దోసకాయ శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి దీనిని వేసవి కాలంలో ప్రతి రోజు తీసుకోవడం వల్ల బాడీకి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. నిజానికి ఇందులో శరీరానికి కావాల్సిన నీటి పరిమాణం అధికంగా లభిస్తుంది. కాబట్టి సమ్మర్‌లో ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో లభించే మినర్స్ ఎండ కారణంగా వచ్చే అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ముఖ్యంగా వేసవిలో దీనితో తయారు చేసిన జ్యూస్ తాగడం వల్ల రెట్టింపు లాభాలు కాలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా అనేక రకాల ప్రయోజనాలను కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
దోసకాయ ప్రయోజనాలు:
దోసకాయలో లిరిక్రిసినోల్, పినోరెసినోల్ మూలకాలు అధిక మోతాదులో లభిస్తాయి. దీంతో పాటు ఇందులో సెకోఐసోలారిసినోల్ కూడా లభిస్తుంది. కాబట్టి క్యాన్సర్ నివారించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది:
దోసకాయ రసంలో శరీరానికి కావాల్సిన మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి సులభంగా రక్తపోటును నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.
దంతాల సమస్యలకు..:
దోసకాయలో నీటి పరిమాణంలో పాటు ఫైబర్ అధికంగా లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు దీని నుంచి తయారు చేసిన రసాన్ని తాగడం వల్ల దంతాల సమస్యలు సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా చిగుళ్ల సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
జీర్ణవ్యవస్థ సమస్యలకు చెక్:
ప్రస్తుతం చాలా మంది జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నారు. దీని కారణంగా కొంతమంది మలబద్ధకం, అజీర్ణం, గుండెల్లో మంట సమస్యల బారిన కూడా పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి రోజు దోసకాయ రసాన్ని తాగాల్సి ఉంటుంది.
ప్రతి రోజు దోసకాయ రసం తాగొచ్చా?:
ప్రతి రోజు దోసకాయ రసం తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల రెట్టింపు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ జ్యూస్‌ని ప్రతి రోజు వ్యాయామాలు చేసిన తర్వాత తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ప్రతి రోజు పడుకునే 30 నిమిషాల ముందు తాగడం వల్ల కూడా శరీర బరువు కూడా నియంత్రించుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి