Cucumber Peel For Weight Loss: దోసకాయలు వేసవిలో చాలా సులభంగా లభిస్తాయి. అయితే వీటిని ఎక్కువగా తినేందుకు ఇష్టపడతారు. ఇందులో నీటి పరిమాణాలు అధికంగా లభిస్తాయి. కాబట్టి సులభంగా బాడీని హైడ్రేట్‌గా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దీనిని సలాడ్స్‌లో అతిగా తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మంది దోసకాయ తొక్కను తీసి వినియోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల మీరు చాలా రకాల పోషకాలను కోల్పోతారని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ కె, విటమిన్ సి వంటి అనేక ఖనిజాలు, విటమిన్లు లభిస్తాయి. కాబట్టి దీని ఫీల్స్‌ తినడం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు బరువు కూడా సులభంగా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ దోసకాయ ఫీల్స్‌ను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దోసకాయను ఎలా తినాలి:
దోసకాయను పొట్టుతో పాటు తినాలనుకునే వారు తప్పకుండా శుభ్రం చేయాల్సి ఉంటుంది. దీనిని డైరెక్ట్‌గా తినడం వల్ల చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి దోసకాయను పొట్టుతో తినాలనుకుంటే, వేడి నీటితో కడిగిన తర్వాత తినాలని నిపుణులు సూచిస్తున్నారు.


దోసకాయను పొట్టు తీసి తినొచ్చా?:
పొట్టుతో పాటు దోసకాయను తింటుంటే చాలా ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దోసకాయలో పీచు పదార్థంతో పాటు.. దాని పై తొక్కలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందుకే దోసకాయను పొట్టుతో కలిపి తింటే మలబద్ధకం సమస్య దూరమవుతుంది. అంతేకాకుండా కడుపు కూడా శుభ్రంగా మారుతుంది.


బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
చాలా మంది బరువు తగ్గిన తర్వాత సులభంగా బరువు పెరుగుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా దోసకాయ ఫీల్‌ను ప్రతి రోజూ తీసుకుంటే సులభంగా బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి తప్పకుండా ఫీల్స్‌తో పాటు దోసకాయను తీసుకోవాల్సి ఉంటుంది.


చర్మ వృద్ధాప్యం నియంత్రిస్తుంది:
మీరు మీ ఆహారంలో దోసకాయను ఎక్కువగా తీసుకుంటే.. చర్మం వృద్ధాప్యాన్ని నియంత్రిస్తుంది. ఇది శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని వేగవంతం చేసి చాలా రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి తప్పకుండా పొట్టుతో పాటు దోసకాయను తీసుకోవాల్సి ఉంటుంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు,  సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read:  Rangamarthanda Movie Review : రంగ మార్తాండ రివ్యూ.. ఉండగలరా కన్నీరు కార్చకుండా?


Also Read: Das Ka Dhamki Movie Review : దాస్ కా ధమ్కీ రివ్యూ.. ప్లాన్ వేశాడు సీక్వెల్‌కి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook