Curd And Dates Recipe: వేసవికాలం సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వేడి శరీరం కలిగిన వ్యక్తులు తప్పకుండా ఈ సమయంలో హైడ్రేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు ఈ సమయంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తప్పకుండా పోషకాలు అధిక మోతాదులో లభించే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రతి రోజు వేసవిలో ఖర్జూరను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఇందులో శరీరానికి కావాల్సిన బోలెడు లాభాలు కలుగుతాయి. సమ్మర్‌లో అరబ్ దేశాల ప్రజలు వినియోగించే ఖర్జూరాలు, పెరుగు రెసిపీని తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు శరీరానికి లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ రెసిపీని వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పొట్ట చల్లగా ఉంటుంది:
సమ్మర్‌లో పొట్ట సమస్యలతో బాధపడుతున్నవారు ఖర్జూరాలు, పెరుగు రెసిపీని ప్రతి రోజు తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రెసిపీని ప్రతి రోజు తీసుకోవడం వల్ల మలబద్ధకంగా సమస్య నుంచి కూడా విముక్తి లభిస్తుంది. దీంతో పాటు ఇందులో లభించే పీచు పదార్థాలు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే మలబద్ధకం ఉన్నవారు ప్రతి రోజు ఈ రెసిపీని తీసుకోవడం వల్ల మంచి సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. 


మానసిక స్థితి మెరుగుపడుతుంది:
ఖర్జూరం, పెరుగు రెసిపీని ప్రతి రోజు తీసుకోవడం వల్ల మానసిక స్థితి కూడా మెరుగుపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఖర్జూరంలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరంలోని హార్మోన్ల సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి కలిగిస్తాయి. దీంతో పాటు మానసిక సమస్యల నుంచి కూడా విముక్తి కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే మనసును ఆనందంగా ఉంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. 


హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది:
ఖర్జూరాల్లో ఉండే ఐరన్  హిమోగ్లోబిన్ సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రక్త సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. దీంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. 


డయాబెటిస్‌ సమస్యలో బాధపడుతున్నారా?:
డయాబెటిస్‌ బాధపడతున్నవారు ప్రతి రోజు పెరుగు, ఖర్జూరాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి 314 కిలో కేలరీలు లభిస్తుంది. దీని కారణంగా శక్తి కూడా రెట్టింపు అవుతుందని ఆరోగ్య నిపుణులు తెపుతున్నారు. ఖర్జూరంలో తక్కువ గ్లైసెమిక్ సూచికలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు మధుమేహంతో బాధపడుతున్నవారు దీనిని తీసుకోవడం వల్ల మంచి లాభాలు పొందుతారు.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


బరువు తగ్గడానికి ఖర్జూర సహాయపడుతుంది:
బరువు తగ్గాలనుకునేవారు ఖర్జూరంను వేసవి కాలంలో ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. దీని కారణంగా శరీరంలోన రోగనిరోధక శక్తి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి సమ్మర్‌లో సులభంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు పెరుగు, ఖర్జూర రెసిపీని తీసుకోవాల్సి ఉంటుంది. 


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి