Curry Leaves: కరివేపాకుని తీసి పాడేసినట్టు..కూరలో కరివేపాకు. ఈ సామెతలు తెలుసు కదా. కేవలం రుచి కోసమే..ప్రయోజనం లేదనుకునేవారినుద్దేశించి చేసిన సామెతలివి. నిజానికి ఆ కరివేపాకు కల్గించే ప్రయోజనాలు వింటే..ఇంకెప్పుడూ పాడేయరు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కరివేపాకు ( Curry leaves ). నిజంగా గొప్ప ఆకులివి. రోజువారీ దినచర్యలో..ముఖ్యంగా తెలుగింటి కూరల్లో కరివేపాకు లేకుండా వంట ఉండదు. అంత ప్రాముఖ్యత ఇచ్చినా తినేటప్పుడు పక్కన పెట్టేస్తుంటారు సాధారణంగా. కరివేపాకు వల్ల కలిగే పూర్తి ప్రయోజానాలు తెలియకపోవడం వల్లనే ఇదంతా. మెడికల్ పరిభాషలో చెప్పాలంటే కరివేపాకు ఒక బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ( Curry leaves as best anti oxidant ) అని మీకు తెలుసా. ప్రతిరోజూ కరివేపాకు ఆకులు కొన్ని తింటే ఎంత ఆరోగ్యం కలుగుతుందో తెలుసా మీకు. కరివేపాకుతో ఎంత రుచి, సువాసన వస్తాయో..ప్రయోజనాలు కూడా అంతే కలుగుతాయి. చర్మం, జుట్టు, ఆరోగ్యాన్ని కాపాడుతాయి. పరకడుపున తింటే ఇంకా మంచిది. 


మీకు జుట్టు రాలే సమస్య ( Hair fall ) ఉంటే ప్రతిరోజూ ఉదయం లేవగానే ఓ గ్లాసు నీరు తాగండి. తరువాత నాలుగైదు కరివేపాకుల్ని నమిలి తినాలి. ఓ అరగంట సేపు ఏం తినకుండా ఉండాలి. కరివేపాకులో ఉండే విటమిన్ సి, ఫాస్పరస్, ఐరన్, కాల్షియం, నికోటినిక్ యాసిడ్ వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జీర్ణక్రియ ( Digestion )మెరుగుపర్చుకోడానికి కరివేపాకు దివ్యౌషధంగా పనిచేస్తంది. పరకడుపున ప్రతిరోజూ తింటే జీర్ణవ్యవస్థలోని ఎంజైమ్స్‌ని క్రమబద్ధీకరిస్తాయి. మలబద్ధకం సమస్య పోతుంది. 


ప్రతిరోజూ ఉదయం లేవగానే బద్ధకం, వికారం ( Nausia ) ఉంటే..కరివేపాకుతో ఆ సమస్యను విముక్తి పొందవచ్చు. రోజూ కరివేపాకు నమిలి తినే అలవాటు చేసుకుంటే వికారం, వాంతులు, బద్ధకం తొలగిపోతాయి. అధిక బరువు ( Obesity ) తో ఇబ్బంది పడుతున్నవారికి కూడా కరివేపాకు మంచి మెడిసిన్. శరీరంలోని చెడు వ్యర్ధాల్ని బయటకు తరిమేస్తాయి. బరువు తగ్గుతారు. 


కరివేపాకు రోజూ వంటలో తినే అలవాటు చేసుకుంటే కంటి చూపు ( Eye sight ) కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా చదవుకునే పిల్లలకు కరివేపాకు అలవాటు చేస్తే చాలా మంచిది. వీటన్నింటికీ మించి కరివేపాకు ఒక బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ అంటే నమ్ముతారా. నిజమే. కరివేపాకు రోజూ తింటే ఆంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్ల అవసరమే లేదు. 


Also read: Tips To Reduce Body Heat: మీ శరీరంలో అధిక వేడిని తగ్గించుకునేందుకు హెల్త్ టిప్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook