Curry Leaves Juice To Lose Weight: పప్పులు, కూరగాయలు, సాంబారు మరింత రుచిగా ఉండేందుకు మసాల దినుసులతో పాటు కరివేపాకులను వినియోగిస్తారు. ఇవి కూరల టేస్ట్‌ను మార్చడమే కాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే ఔషధ కకొలగుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ప్రభావంతంగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ దీనితో తయారు చేసిన రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరివేపాకులో ఉండే పోషకాలు ఇవే:
ప్రతి 100 గ్రాముల కరివేపాకులో 108 కేలరీలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఫైబర్, ప్రొటీన్, మినరల్స్, కార్బోహైడ్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, జింక్, ఐరన్, మెగ్నీషియం అధిక పరిమాణంలో ఉంటాయి. అంతేకాకుండా కరివేపాకులో విటమిన్ సి, ఇ, బి1, బి9, బి2, బి3 ఉంటాయి.


Also Read: Virat Kohli: జిమ్‌లో చెమటలు చిందిస్తున్న విరాట్ కోహ్లీ.. ఆ ఫిట్‌నెస్ ఏంది సామీ..!  


కరివేపాకు రసం ప్రయోజనాలు:
❋ అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా కరివేపాకు రసాన్ని ప్రతి రోజు తాగాల్సి ఉంటుంది. అధిక కొలెస్ట్రాల్‌ కారణంగా వచ్చే గుండె సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ప్రతి రోజు 2 నుంచి 3 గ్లాసుల కరివేపాకు రసం తాగాల్సి ఉంటుంది. 


❋ కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఈ రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల శరీరంలో ఉండే హానికరమైన టాక్సిన్స్ శరీరం నుంచి బయటికి వస్తాయి. దీని కారణంగా అనేక వ్యాధుల కూడా దూరమవుతాయి.


❋ కరివేపాకులో విటమిన్ ఎ కూడా లభిస్తుంది. కంటి చూపు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ రసాన్ని తాగడం వల్ల కంటి చూపు సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు నిపుణులు తెలుపుతున్నారు. 


❋ ప్రస్తుతం చాలా మంది శరీర బరువు పెరుగుతున్నారు. అయితే ఊబకాయం సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు కరివేపాకు రసాన్ని ప్రతి రోజు తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలో డిటాక్సిఫైయింగ్ ఏజెంట్‌గా పని చేస్తాయి. దీంతో సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 


❋ తరచుగా రక్తహీనత సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు కరివేపాకు రసాన్ని తాగాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచేందుకు కూడా సహాయపడుతుంది. 


Also Read: Virat Kohli: జిమ్‌లో చెమటలు చిందిస్తున్న విరాట్ కోహ్లీ.. ఆ ఫిట్‌నెస్ ఏంది సామీ..!  



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి