Virat Kohli: జిమ్‌లో చెమటలు చిందిస్తున్న విరాట్ కోహ్లీ.. ఆ ఫిట్‌నెస్ ఏంది సామీ..!

Virat Kohli Gym Workout Pics: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు విరాట్ కోహ్లీ జిమ్‌లో ఫుల్‌ వర్కౌట్స్ చేస్తున్నాడు. జిమ్‌లో కష్టపడుతున్న పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతున్నాయి. ఈ నెల 12 నుంచి విండీస్ టూర్ ప్రారంభంకానుంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Jul 9, 2023, 08:18 AM IST
Virat Kohli: జిమ్‌లో చెమటలు చిందిస్తున్న విరాట్ కోహ్లీ.. ఆ ఫిట్‌నెస్ ఏంది సామీ..!

Virat Kohli Gym Workout Pics: టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం జట్టులో అందరి కంటే ఎక్కువ ఫిట్‌గా ఉండే ప్లేయర్లలో కోహ్లీనే ముందుంటాడు. నిత్య జిమ్‌లో కష్టపడుతూ.. సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఎప్పటికప్పుడు తనకు తాను మెరుగులు దిద్దుకుంటాడు. 34 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడి మాదిరే పాదరసంలా గ్రౌండ్‌లో కదులుతుంటాడు. తాజాగా జిమ్‌లో కోహ్లీ వర్కౌట్స్‌ చేస్తున్న పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. 

జిమ్‌లో చెమటలు చిందిస్తున్న పిక్స్‌ను కోహ్లీ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఒక పిక్‌లో జిమ్ ట్రైనర్ సాయంతో కేవలం షార్ట్‌తోనే కోహ్లీ వర్కౌట్స్ చేస్తున్నాడు. మరో పిక్‌లో ఒంటరిగా కష్టపడుతున్నాడు. "ప్రతి రోజూ కాలు కదుపుతూ ఉండాలి.. ఎనిదేళ్లుగా కౌంటింగ్." అంటూ కోహ్లీ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫొటోలపై కోహ్లీ ఫ్యాన్స్ లైక్స్, కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. ఈ ఏడాది విరాట్ కోహ్లీ సూపర్‌ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఐదు 5 టెస్టు మ్యాచ్‌ల్లో ఆడగా.. 8 ఇన్నింగ్స్‌లలో 45 సగటుతో 360 పరుగులు చేశాడు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 14, రెండో ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేశాడు. 

ప్రస్తుతం టీమిండియా విండీస్‌ టూర్‌లో ఉంది. రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. జూలై 12న మొదటి టెస్టుతో భారత పర్యటన మొదలుకానుంది. తొలి మ్యాచ్ డొమినికా వేదికగా జరగనుంది. ఈ సిరీస్‌తో భారత్ డబ్ల్యూటీసీ సైకిల్‌ను మొదలు పెట్టనుంది. ఇప్పటికే కరేబియన్ గడ్డపై అడుగుపెట్టిన భారత ఆటగాళ్లు.. ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. వెస్టిండీస్‌పై సిరీస్ విజయం సాధించి.. ఇటీవల డబ్ల్యూటీసీ ఫైనల్‌లో త్వరగా మర్చిపోవాలని భావిస్తోంది. టెస్టులు, వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. టీ20లకు హార్ధిక్ పాండ్యా నాయకత్వం వహించనున్నాడు. టీ20లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ విశ్రాంతినిస్తున్న విషయం తెలిసిందే.
 
విండీస్‌తో టెస్టు సిరీస్‌కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ, ముఖేష్ కుమార్. 

Also Read: Salaar Movie: సలార్ సినిమాపై పెరిగిన అంచనాలు, 2000 కోట్లు దాటేస్తుందా

Also Read: Yatra 2 Movie: యాత్ర 2 సినిమాపై ఎవరేమనుకున్నా ఫరవాలేదు, ఎన్నికల ముందే విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News