Cycling For Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు చాలా మంద డైట్‌ పద్ధతులను మాత్రమే అనుసరిస్తున్నారు. ఎలాంటి శరీరక శ్రమ చేయలేకపోతున్నారు. అయితే డైటింగ్‌తో పాటు వ్యాయామాలు చేయడం కూడా చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్లే సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా చాలా మంది ఆహార పదార్థాలను తీసుకోవడం మానుకుంటున్నారు. ఇలా చేయడం కూడా శరీరానికి చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ఆరోగ్య నిపుణులు సూచించిన ఆహారాలు తీసుకోవడమే కాకుండా వ్యాయామాలు కూడా తప్పని సరిగా చేయాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గే క్రమంలో కీటో డైట్‌ను అనుసరిస్తున్నారు. ఈ డైట్‌ను అనుసరించడం చాలా మంచిదే..కానీ బరువు తగ్గిన వెంటనే డైట్‌ మానుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల మళ్లీ బరువు పెరుగుతున్నారు. అయితే బరువు తగ్గే క్రమంలో తప్పకుండా దీర్ఘకాలం పాటు డైట్‌లను అనుసరించాల్సి ఉంటుంది. దీనితో పాటు వ్యాయామాలు కూడా తప్పకుండా చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే సులభంగా ఫలితాలు పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ కింది వ్యాయామాలు ప్రతి రోజు చేయండి చాలు.


వేగంగా బరువు తగ్గడానికి చేయాల్సిన వ్యాయామాలు:
వాకింగ్:

సులభంగా బరువు తగ్గడానికి తప్పకుండా కనీసం 30 నిమిషాల పాటు నడవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఒక గంట నిరంతరాయంగా నడవడం వల్ల 350 కేలరీలు బర్న్ అవుతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా నడవాల్సి ఉంటుంది. 


Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా


జాగింగ్:
రన్నింగ్, జాగింగ్ చేయడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల కాళ్లు కూడా దృఢంగా మారుతాయి. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాపడేవారు తప్పకుండా జాగింగ్‌ చేయాల్సి ఉంటుంది. 


సైకిల్ తొక్కడం:
ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సైక్లింగ్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గుతారు. వేగంగా బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు 6 కిలో మీటర్ల పాటు సైకిల్ తొక్కాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల కూడా రాకుండా ఉంటాయట.


స్విమ్మింగ్:
70 కిలోల బరువున్న వ్యక్తికి 30 నిమిషాల పాటు ఈత కొట్టడం వల్ల దాదాపు 216 కేలరీలు బర్న్ అవుతాయని అధ్యయనాల్లో తెలింది. కాబట్టి ఊబకాయం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా స్వమ్మింగ్‌ చేయాల్సి ఉంటుంది. బరువు సులభంగా తగ్గాలకునేవారు తప్పకుండా 1 గంట పాటు ఈత కొట్టండి.


Also Read: AP Politics: చంద్రబాబుతో మంచు మనోజ్ దంపతుల కలయిక, మతలబు అదేనా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook