మీ జుట్టు కుదుళ్లు బలహీనపడినప్పుడు జుట్టు రాలడం ( Hair fall ) మొదలవుతుంది. మీ తలపైన ఉండే చర్మం పొడిబారినప్పుడు ( Dry scalp ) అది చుండ్రుగా మారుతుంది. మీ కుదుళ్ళు బలహీన పడినప్పుడే కాకుండా చుండ్రుతో ( Dandruff ) బాధపడే వారిలోనూ జుట్టు రాలే సమస్య చాలా సాధారణంగా కనిపిస్తుంటుంది. చాలా మందికి నా జుట్టు ఎందుకు రాలిపోతుంది? ఇది పోషకాహారం లోపమా లేక కుదుళ్ళ బలహీనత వల్లనా ? అనే సందేహాలు వేధిస్తుంటాయి. ఈ రెండూ కాకుండా చుండ్రు వల్లే రాలిపోతుందా ? అని మధనపడిపోయే వాళ్లూ ఉంటారు. చుండ్రు ఉండి జుట్టు రాలుతున్నట్టయితే.. చుండ్రు వల్లే అలా జుట్టు రాలే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు పలువురు డెర్మటాలజీ నిపుణులు ( Dermatology experts ). అలాగని చుండ్రు ఉన్న ప్రతీ ఒక్కరిలో జుట్టు రాలే సమస్యలు కూడా కనిపించవు. Also read : Sanitizers: శానిటైజర్స్ అతిగా వాడుతున్నారా ? ఐతే ఇది చదవండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలా మంది తలస్నానం ( Head bath ) చేసేటప్పుడు జుట్టు రాలడం గమనిస్తూ ఉంటారు. తరచుగా జుట్టును Shampoo wash చేయడం వల్లనే జుట్టు రాలడం, పొడిబారిపోవడం  వంటివి జరుగుతున్నాయని చాల రోజుల పాటు తల స్నానం చేయడం ఆపుతారు. అలా చేయడం వల్ల జుట్టు ఇంకా ఎక్కువ స్థాయిలో ఊడిపోయే అవకాశాలు ఉన్నాయని Hair care experts చెబుతున్నారు. అలాగే చుండ్రు వల్ల తలలో దురద మొదలవుతుంది ( Itching due to dandruff ). దానివల్ల కొంతమంది ఎప్పుడు చూసిన తలను గోకుతూనే ఉంటారు. అలా గీకడం వల్ల జుట్టు లాగినట్టు అయ్యి ఇంకా ఎక్కువగా ఊడుతుందట. Also read : Coronavirus: కరోనావైరస్ నుంచి కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను శుభ్రపరచడం ఎలా ?


కొన్నిసార్లు, కొన్ని రకాల ట్యాబ్లేట్స్ వాడడం వల్ల కలిగే వాటి సైడ్ ఎఫెక్ట్స్ ( Side effects ) వల్ల కూడా జుట్టు రాలుతుంది. జుట్టు రాలకుండా ఉండేందుకే వాడే ఔషధాలలో రకరకాల రసాయనాలు కలిగి ఉంటాయి. ఇవి మాడును పొడిగా మారుస్తాయి. ఫలితంగా చుండ్రు ఏర్పడి దురద వస్తుంది. ఈ సమస్యను అరికట్టాలంటే.. మీరు మీ జుట్టును చుండ్రును నిరోధించే షాంపూతో క్రమం తప్పకుండా కడగడం మంచిది.


చుండ్రు సమస్యను, జుట్టు రాలడాన్ని సహజంగా ఎలా ఎదుర్కోవాలి ?
మొదట, జుట్టు రాలకుండా తీసుకునే జాగ్రత్తలలో ఆరోగ్యకరమైన ఆహారం అనేది చాలా ముఖ్యమైనది. మీరు తీసుకునే ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలను ఉండేలా చూసుకోవాలి, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అంతే కాకుండా, జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. చుండ్రును ఎదుర్కోవటానికి, వారానికి ఒకసారి మీ జుట్టును ఆపిల్ సైడర్ వెనిగర్‌తో ( Apple cider vinegar for hair ) కడగడానికి ప్రయత్నించండి. ఆపిల్ సైడర్ వెనిగర్ యాంటీ బాక్టీరియల్ గుణాలు చుండ్రును ఎదుర్కోవటానికి సహాయపడతాయి. Also read : 
Health tips: ఉప్పు ఎక్కువ తింటున్నారా ? ఐతే ఈ ప్రాబ్లమ్స్ తప్పవు


Hair loss సమస్యను నివారించడానికి ఒక్కోసారి చిన్నచిన్న చిట్కాలు కూడా ఉపయోగపడతాయి. అందులో ఒకటి కోడి గుడ్డులోని పసుపు పచ్చనీలం. ఇందులో ఆరోగ్యకరమైన జుట్టుకు అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. 


గమనిక: ఇందులో ఉన్న సమాచారం డెర్మటాలజిస్టుల సలహా మాత్రమే. ఐతే, అన్ని సందర్భాలలో ఆరోగ్య సమస్యలు ఒకలా ఉండవు. శరీరంలో మార్పుల ఆధారంగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వాటి పరిష్కారం, చికిత్స కోసం వైద్యుడిని సంప్రదించిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకోవడం మేలు. Also read : మీ ప్యాకెట్ పాలు Coronavirus నుండి సురక్షితమేనా ?