మీ ప్యాకెట్ పాలు Coronavirus నుండి సురక్షితమేనా ?

Milk packets కరోనావైరస్ నుంచి సురక్షితమేనా అనే సందేహం మిమ్మల్ని వేధిస్తుందా ? మీరు ఎంత పరిశుభ్రత పాటించినా, ఎంత ఆరోగ్య స్పృహతో ఉన్నా.. ఈ ప్రశ్న కచ్చితంగా మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తోందా ? ఐతే, ఇది మీరు తప్పక చదవాల్సిందే. ప్యాకేజీ చేసిన పాలు వైరస్ రహితంగా ఉండేలా FSSAI ( ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ) కొన్ని సింపుల్ టిప్స్‌ను షేర్ చేసుకుంది.

Last Updated : Jul 29, 2020, 08:50 PM IST
మీ ప్యాకెట్ పాలు Coronavirus నుండి సురక్షితమేనా ?

Milk packets కరోనావైరస్ నుంచి సురక్షితమేనా అనే సందేహం మిమ్మల్ని వేధిస్తుందా ? మీరు ఎంత పరిశుభ్రత పాటించినా, ఎంత ఆరోగ్య స్పృహతో ఉన్నా.. ఈ ప్రశ్న కచ్చితంగా మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తోందా ? ఐతే, ఇది మీరు తప్పక చదవాల్సిందే. ప్యాకేజీ చేసిన పాలు వైరస్ రహితంగా ఉండేలా FSSAI ( ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ) కొన్ని సింపుల్ టిప్స్‌ను షేర్ చేసుకుంది. పాలు ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇది మన శరీరానికి కావలసిన కాల్షియం, మినరల్స్‌ను ( Health benefits of milk) అందిస్తుంది. అందుకే పాలు అనేవి నిత్యావసరాల్లో ఒక భాగం అయ్యాయి.

Coronavirus మొదలైనప్పటి నుండి, కరోనా బారిన పడకుండా ఉండటం కోసం అన్నివర్గాల ప్రజల్లో పరిశుభ్రతపై కొంత అవగాహన పెరిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే కొన్ని విచిత్రమైన ఆలోచనలతో పాల ప్యాకెట్లను డిటర్జెంట్‌తో కడగడం లేదా శానిటైజర్‌తో కూరగాయలను శుభ్రం చేయడం వంటి వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ అపోహలకు చెక్ పెట్టడానికి, ప్యాకెట్ పాలు వైరస్ రహితంగా ఉండేలా FSSAI కొన్ని చిట్కాలు వెల్లడించింది.

Also readHow to check BP: హై బీపీకి చెక్ పెట్టే ఫుడ్స్ ఇవే

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) చెప్పిన చిట్కాలు ఇవే..

Mask: మిల్క్‌ బాయ్ నుండి పాలు తీసుకునేటప్పుడు మీరు ప్రాథమిక భద్రతా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. సరైన భౌతిక దూరాన్ని ( Social distancing) పాటిస్తున్నారా లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోండి. పాల అమ్మకందారుడు మాస్క్ ధరించి ( Wearing mask ) ఉన్నారా లేదా అనేది నిర్ధారించుకోండి. లేకపోతే మాస్కు ధరించాల్సిందిగా వారికి సలహా ఇవ్వండి.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Here are some simple tips to keep in mind for keeping packaged milk clean. #EatRightIndia #HealthForAll #SwasthaBharat

A post shared by FSSAI (@fssai_safefood) on

Washing hands: పాల ప్యాకెట్లను తీసుకున్న తర్వాత, మీ చేతులను సబ్బుతో శుభ్రంగా కడగండి. 

Cleaning milk packets: పాల ప్యాకెట్‌ను నీటిలో కడిగితే చాలు. శానిటైజర్లతో కాని డిటర్జెంట్‌తో కాని కడగాల్సిన అవసరం లేదు. తరువాత, ఆ ప్యాకెట్‌‌కి ఉన్న నీళ్ళు పాల పాత్రలోకి రాకుండా ఉండటానికి ప్యాకెట్‌ను కాసేపు పక్కన ఉంచండి. ప్యాకెట్‌కి ఉన్న నీళ్ళని తుడచడానికి కిచెన్ టవల్ ( Kitchen towels) ఉపయోగించవద్దు. Also readJackfruit benefits: పనస పండుతో ప్రయోజనాలు.. మాంసాహారానికి మంచి ప్రత్యామ్నాయం

తరువాత, మళ్లీ మీ చేతులను కడుక్కొని ప్యాకెట్‌ను జాగ్రత్తగా కత్తిరించి పాత్రలో పోయాలి.

ఇప్పుడు పాలను వేడి చేయండి. పాశ్చరైజేషన్ పాలు తాగడానికి సురక్షితంగా ఉంటాయి.

ఈ సులభమైన చిట్కాలు పాటిస్తే.. పాల ప్యాకెట్‌తో కరోనావైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో విజయవంతం అయినట్టే.

పాల ప్యాకెట్స్‌ని శుభ్రం చేయడం కోసం శానిటైజర్ స్ప్రేలు ( Sanitizers) లేదా డిటర్జెంట్ ఉపయోగించడం మంచిది కాదు. ముఖ్యంగా, అలా శుభ్రం చేసే క్రమంలో ఆ రసాయనాలు పాలలోకి వస్తే అది ఆరోగ్యానికే ప్రమాదకరం. అందువల్ల సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండటానికి సరైన చిట్కాలను అనుసరించడం ఎల్లప్పుడూ మంచిది. Also read: Vitamin C foods: రోగ నిరోధక శక్తి పెంచే పండ్లు, కూరగాయలు, ఇతర ఆహారపదార్థాలు

Trending News