Dark Neck Treatment At Home: ప్రస్తుతం చాలా మందిలో కాలుష్యం కారణంగా మెడపై చర్మం నలుపు రంగులో మారుతోంది. అయితే ఇది కూడా చర్మ సమస్య కాబట్టి చాలా మంది మార్కెట్‌లో లభించే స్కిన్‌ కేర్‌ ప్రోడక్ట్స్‌ వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించడం వల్ల ఫలితం కొంత కాలం వరకే ఉంటుంది. కాబట్టి వీటిని వినియోగించే బదులుగా నిపుణులు సూచించిన పలు ఇంటి చిట్కాలను పాటించడం వల్ల ఈ డార్క్‌నెక్‌ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ప్రస్తుతం చాలా మంది చర్మ సంరక్షణలో భాగంగా ముఖం, చేతులతో పాటు కాళ్ళకు శ్రద్ధ వహిస్తారు. మెడకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు. ముఖం అందంగా కనిపించడానికి మెడపై చర్మం కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. డార్ట్‌ నెక్‌ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా నిపుణులు సూచించి ఈ చిట్కాలు పాటించి ఉపశమనం పొందొచ్చు.


మెడ నల్లబడటానికి కారణం:


శరీరంలో ఐరన్ పరిమాణం తగ్గినప్పుడు మెడ రంగు నల్లగా మారుతుంది. అధిక సూర్యరశ్మి కారణంగా హైపర్పిగ్మెంటేషన్ సమస్య కారణంగా ఇలాంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మెడపై జుట్టు కట్‌ చేసిన తర్వాత కూడా దానిపై సూర్యకాంతి అనుభూతి పడి తీవ్రంగా నల్లబడుతుందని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొందరిలో దీని కారణంగా మెడతో పాటు చర్మం కూడా నల్లగా మారుతుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


నల్లటి మెడను నివారించడానికి చిట్కాలు:


  • స్త్రీలు పడుకునే క్రమంలో ఆభరణాలను తీసివేసి పడుకోవాలి.

  • మెడపై రుద్దే బట్టలు ధరించవద్దు.

  • మెడను తేలికగా ఉంచుకుని నిద్రిపోవాలి.

  • మెడను ఎప్పుడూ స్క్రబ్ చేయవద్దు.

  • మెడను సున్నితంగా శుభ్రం చేయండి.

  • మెడపై తప్పనిసరిగా సన్‌స్క్రీన్ అప్లై చేయాలి.

  • చక్కెర ఉన్న వస్తువులకు దూరంగా ఉండండి.


డార్క్‌ నెక్‌ ఇలా తొలగించండి..?
ముందుగా 1 చెంచా మైదా పిండిని తీసుకుని..అందులోనే  1 కప్పు పెరుగు,  1 టీస్పూన్ పసుపు వేసి బాగా మిక్స్‌ చేసుకోవాలి. దీనిని మిశ్రమంలా తయారు చేసుకుని డార్క్‌ నెక్‌కు బాగా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల సులభంగా డార్క్‌ నెక్‌ సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.


ఇది కూడా చదవండి : Tata Micro SUV @ Rs 6Lakhs: హ్యుండయ్ క్రెటా, వెన్యూలను తలదన్నే టాటా మోటార్స్ ఎస్‌యూవీ, ధర కేవలం రూ.6 లక్షలే!


ఇది కూడా చదవండి : 3 Lakhs Discount Cars: మార్చి బొనాంజా.. ఈ 5 కార్లపై 3 లక్షల వరకు తగ్గింపు! బెస్ట్ ఎస్‌యూవీ కొనడానికి ఉత్తమ సమయం ఇదే


ఇది కూడా చదవండి : Best Hatchback Cars: బెస్ట్‌ హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే..రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్‌!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook