Delta Variant Of COVID-19: భారత్‌లో మొదటగా గుర్తించిన డెల్టా కరోనా వేరియంట్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా 85 దేశాలలో నమోదయ్యాయి. పరిస్థితి గమనిస్తే ఇది ప్రమాదకర వేరియంట్‌గా మారుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిప్రాయపడింది. ఇదివరకే కరోనా కేసులు నమోదైన దేశాల్లోనూ మరిన్ని ప్రాంతాల్లో ఇంకా వ్యాప్తి చెందవచ్చునని పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదివరకే ఆల్ఫా కోవిడ్19 వేరియంట్ 170 దేశాలలో వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. కోవిడ్19 వారాంతపు ఎపిడెమియోలాజికల్ అప్‌డేట్‌ను జూన్ 22న విడుదల చేసింది. బీటా వేరియంట్‌ను 119 దేశాలు, గామా వేరియంట్‌ను 71 దేశాల్లో మరియు డెల్టా వేరియంట్‌ను ప్రస్తుతానికి 85 దేశాల్లో గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌వో (World Health Organisation) తెలిపింది. డెల్టా వేరియంట్ గత రెండు వారాల్లోనే 11 దేశాలకు వ్యాప్తి చెందినట్లు పేర్కొంది. డెల్టా వేరియంట్‌ను అంత తేలికగా తీసుకోకూడదని త్వరతగతిన చర్యలు చేపట్టి ఆల్ఫా, బీటా, గామా మరియు డెల్టా కోవిడ్19 వేరియంట్‌(COVID-19 New Wave)లు మరింత వ్యాప్తి చూడాలని భావిస్తోంది.


Also Read: AstraZeneca Corona vaccine: ఇండియా వేరియంట్‌పై 80 శాతం ప్రభావం చూపుతున్న వ్యాక్సిన్లు


ఒకవేళ డెల్టా వేరియంట్‌పై ఫోకస్ చేయకపోతే మరింత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించింది. భారత్‌లో గత వారం రోజుల్లో (జూన్ 14 - 20) 4,41,976 కరోనా కేసులు, 16,329 మరణాలు నమోదయ్యాయని గుర్తుచేసింది. భారత్‌లో కరోనా కేసులు తగ్గడంతో సౌత్-ఈస్ట్ ఆసియా ప్రాంతంలో గత వారంతో పోల్చితే 21 శాతం కేసులు తగ్గాయి. డెల్టా వేరియంట్ (Indian Covid-19 Variants) బారిన పడిన కరోనా బాధితులలో అధికశాతం ఆక్సిజన్ సిలిండర్ అవసరమైందని సింగపూర్ నిపుణుల అధ్యయనంలో తేలింది. ఆల్ఫా వేరియంట్‌తో పోల్చితే డెల్టా వేరియంట్‌తో కరోనా కేసులు అధికంగా నమోదైనట్లు జపాన్ నిపుణులు చెబుతున్నారు. 


Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే పిల్లలు పుట్టరా, కేంద్ర ఆరోగ్యశాఖ క్లారిటీ


యూకేలో సైతం కరోనా కేసులు పెరగడానికి డెల్టా వేరియంట్ సైతం ఓ కారణం. ముఖ్యంగా 16 ఏళ్లు పైబడిన వారిలో వేగంగా ఈ వేరియంట్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. ఫైజర్ బయో‌ఎన్‌టెక్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ రెండో తీసుకున్న అనంతరం సైతం కరోనా బాధితులు ఆసుపత్రులలో చేరుతున్నారని, డెల్టా బారిన పడి చేరిన వారు 94 శాతం ఉన్నారని పేర్కొంది. స్కాట్లాండ్‌లోనూ రెండు డోసుల ఫైజర్ బయో‌ఎన్‌టెక్ వ్యాక్సిన్ తీసుకున్న వారు సైతం ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటన్నారని ఓ అధ్యయనంలో వెల్లడైంది.


Also Read: Health Benefits Of Milk: ప్రతిరోజూ పాలు ఆరోగ్యానికి మంచిదేనా, ఏ పాలు తాగడం శ్రేయస్కరం 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook