Dengue Remedies: ఈ 5 జ్యూస్‌లు తాగితే డెంగ్యూ ముప్పు నుంచి కాపాడుకోవచ్చు
Dengue Remedies: ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. దేశంలో డెంగ్యూ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. వర్షాకాలంలో అశుభ్రత కారణంగా దోమల బెడద తీవ్రంగా ఉంటోంది. ఫలితంగా డెంగ్యూ వ్యాధి ప్రబలుతోంది. అయితే కొన్ని హోమ్ రెమిడీస్ ద్వారా డెంగ్యూ నుంచి రక్షించుకోవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.
వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం, వ్యర్ధాల కారమంగా దోమలు వృద్ది చెందడంతో డెంగ్యూ తీవ్రంగా వ్యాపిస్తోంది. డెంగ్యూ అనేది తీవ్రమైన వ్యాధి. దోమకాటుతో వ్యాపించే ఈ వ్యాధికి సకాలంలో చికిత్స చేయించుకోకపోతే ప్రాణాంతకం కావచ్చు. ముఖ్యంగా ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గడంతో రోగికి ప్రాణసంకటం ఉంటుంది.
డెంగ్యూ వ్యాధి సోకినప్పుడు ప్రధానంగా కన్పించే సమస్య ప్లేట్‌లెట్ కౌంట్ గణనీయంగా తగ్గడం. దీనివల్ల రోగి ఎంత నీరసపడిపోతాడంటే అవయవాలు కూడా సరిగ్గా పనిచేయవు. అయితే ఈ ప్లేట్‌లెట్ కౌంట్ ఎప్పటికప్పుడు పెంచుకుంటే డెంగ్యూ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. కొన్ని హోమ్ రెమిడీస్ పాటించడం ద్వారా ప్లేట్‌లెట్ సంఖ్య భారీగా పెంచవచ్చు. ముఖ్యంగా ఐదు రకాల జ్యూస్‌లు తాగడం ద్వారా ప్లేట్‌లెట్ కౌంట్ గణనీయంగా పెరుగుతుంది. ఇందులో ఒకటి గిలోయ్ ఆకుల జ్యూస్. గిలోయ్ ఆకులకు ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధంగా పరిగణిస్తారు. గిలోయ్ ఆకుల జ్యూస్ శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. ప్లేట్ లెట్ కౌంట్ పెంచుతుంది. డెంగ్యూ లక్షణాల్ని గణనీయంగా తగ్గిస్తుంది.
బొప్పాయి ఆకుల జ్యూస్ అనాదిగా వస్తున్న చికిత్సా విధానం. అద్భుతమైన రెమిడీ ఇది. దీనివల్ల యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేట్‌లెట్ కౌంట్ పెరుగుతుంది. బొప్పా.యి ఆకుల జ్యూస్ తాగితే శరీరంలో ప్లేట్‌లెట్ కౌంట్ గణనీయంగా పెరుగుతుంది. దీనికోసం బొప్పాయి లేత ఆకుల్ని నూరుకుని రసం తీయాలి. రోజుకు రెండు సార్లు ఒక స్పూన్ లేదా రెండు స్పూన్స్ తాగాలి. ఇది చాలా చేదుగా ఉంటుంది. కానీ గణనీయంగా ప్లేట్‌లెట్ కౌంట్ పెంచుతుంది.
దానిమ్మ జ్యూస్ మరింత అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ప్లేట్‌లెట్ కౌంట్ పెంచడంలో కీలకంగా ఉపయోగపడుతుంది. దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. డెంగ్యూ వ్యాధి సోకినప్పుుడు దానిమ్మ జ్యూస్ తాగడం చాలా మంచిది. త్వరగా కోలుకునేందుకు వీలుుంటుంది
వేపాకుల్లో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ. డెంగ్యూ వైరస్‌ను చంపేందుకు వేపాకుల జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. వేపాకుల జ్యూస్ ప్లేట్‌లెట్ కౌంట్ పెంచడంలో దోహదమౌతుంది. వేపాకుల్ని ఉడికించి ఆ నీటిని రోజుకు రెండు సార్లు తాగాలి. కివీ ఓ అద్భుతమైన ఫ్రూట్. దీని ద్వారా ప్లేట్‌లెట్ కౌంట్ విపరీతంగా పెరుగుతుంది. ఇందులో విటమిన్ సి , యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అంతేకాకుండా ప్లేట్‌లెట్ కౌంట్ గణనీయంగా పెరుగుతుంది. రోజుకు 2-3 కివీ ఫ్రూట్స్ తినాలి.
Also read: Viral Fever tips: ఈ సూచనలు పాటిస్తే వైరల్ ఫీవర్ల నుంచి కాపాడుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.