Viral Fever tips: ఈ సూచనలు పాటిస్తే వైరల్ ఫీవర్ల నుంచి కాపాడుకోవచ్చు

Viral Fever tips: సీజన్ మారిన ప్రతిసారీ వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా వైరల్ ఫీవర్లు ఎదుర్కోవల్సిన పరిస్థితి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధుల్నించి తప్పకుండా రక్షించుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఆ జాగ్రత్తలేవో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 11, 2024, 03:06 PM IST
Viral Fever tips: ఈ సూచనలు పాటిస్తే వైరల్ ఫీవర్ల నుంచి కాపాడుకోవచ్చు

Viral Fever tips: ప్రస్తుతం ఎక్కడ చూసినా వైరల్ ఫీవర్లు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఈ వైరల్ ఫీవర్లు ప్రత్యేకించి వర్షాకాలంలో సీజన్ మారగానే ఎదురౌతుంటాయి. దీనికి కారణం ఒకటే వైరస్ సంక్రమణ. శరీరంలో ఉండే ఇమ్యూనిటీ బలహీనంగా ఉండటంతో ఈ పరిస్థితి ఎదురౌతుంటుంది. 

సీజన్ మారగానే తలెత్తే వైరల్ ఫీవర్లతో పాటు తలనొప్పి, గొంతులో గరగర, శరీరంలో నొప్పి, బలహీనత వంటి సమస్యలు అధికంగా కన్పిస్తాయి. వైరల్ ఫీవర్లు అన్నీ ఒకేలా ఉండవు. వేర్వేరుగా ఉంటాయి. కొన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తే ఈ వైరల్ ఫీవర్ల నుంచి తప్పకుండా కాపాడుకోవచ్చు. వైరల్ ఫీవర్ల నుంచి కాపాడుకోవాలంటే శరీరం హైడ్రేట్‌గా ఉండేట్టు చూసుకోవాలి.  రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీళ్లు తప్పనిసరిగా తాగాల్సి ఉంటుంది. తాజా పండ్ల రసం, సూప్ కూడా మధ్యమధ్యలో తీసుకోవాలి. దీనివల్ల శరీరానికి ఎనర్జీ లభిస్తుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. 

వైరల్ సంక్రమణల్నించి కాపాడుకునేందుకు చేతులు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే వైరల్ ఇన్‌ఫెక్షన్ చేతుల్నించే మొదలు కావచ్చు. రోజంతా ఎక్కడెక్కడో చేతులతో తాకుతుంటారు. దీనివల్ల వైరస్ సంక్రమించవచ్చు. అందుకే చేతుల్ని సబ్బు లేదా హ్యాండ్‌వాష్ సహాయంతో శుభ్రం చేసుకోవాలి. శానిటైజర్ ఉపయోగిస్తే మరీ మంచిది. శరీరం ఇమ్యూనిటీ పెంచుకోవాలి. దీనికోసం తాడా పండ్లు, కూరగాయలు, విటమిన్ సి అదికంగా ఉండే ఆహార పదార్ధాలు , ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. అల్లం, తులసి, తేనె, నిమ్మరసం తప్పకుండా డైట్‌లో ఉండాలి. 

వైరల్ ఇన్‌ఫెక్షన్లు సాధారణంగా రద్దీ ప్రాంతాల్లో మొదలవుతుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, మార్కెట్లలో ఉండేటప్పుడు మాస్క్ ధరించి జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్క్ ధరించడం ద్వారా వైరల్ సంక్రమణ నుంచి కాపాడుకోవచ్చు. వైరల్ ఫీవర్ల నుంచి కాపాడుకునేందుకు శరీరానికి విశ్రాంతి అవసరం. విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీరం త్వరగా కోలుకుంటుంది. మంచి నిద్ర ఉండాలి. కనీసం 7-8 గంటలు నిద్ర అవసరం. వైరల్ ఫీవర్ లక్షణాలు జ్వరం, దగ్గు, గొంతు గరగర కన్పిస్తే వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. 

Also read: Infinix Zero 40: కేక పెట్టించే ఫీచర్లు, 108MP ప్రైమరీ, 50MP సెల్ఫీ కెమేరాతో ఇన్ఫినిక్స్ జీరో 40

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News