Dengue Cases: దేశవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. ఏపీలోనూ కొవిడ్ కేసులు(Corona Cases) ఎక్కువ అవుతున్నాయి. మూడు నాలుగు జిల్లాల్లో పరిస్థితి ఆందొళన కరణంగానే ఉంది. దానికి తోడు స్కూల్స్ రీ ఓపెన్  (Schools Reopen)అవ్వడంతో కొంతమంది విద్యార్థులు కూడా కరోనా (Corona virus) బారిన పడుతున్నారు. సెకెండ్ వేవ్ పూర్తిగా ముగియకముందే థర్డ్ వేవ్(Corona Third Wave) భయాలు వెంటాడుతున్నాయి. ఇలాంటి సమయంలో మరో మహమ్మారి ప్రజలను వణికిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలే ఇది వర్షాకాలం.. వైరల్ ఫీవర్ల(Viral Feavers)కు అడ్డగా చెప్పుకునే సీజన్ దీంతో  కరోనాను మించి డెంగ్యూ మహమ్మారి కోరలు చాచుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో జనం ఆస్పత్రుల బాట పట్టాల్సి వస్తోంది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. ప్రస్తుతం ఏపీలో డెంగ్యూ డేంజర్ బెల్స్ (Dengue danger bells) మోగిస్తుంది. రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదువుతున్నాయి.  డెంగ్యూ బాధితులతో ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. కురుస్తున్న వర్షాలతో పారిశుధ్య నిర్వహణ లేకపోవటంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. అసలే కరోనా కల్లోలంతో వణికిపోతున్న జనానికి డెంగ్యూ కునుకులేకుండా చేస్తోంది.


Also Read: India Corona Update: దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా ఉధృతి, ఆ ఒక్క రాష్ట్రంలోనే 70


ఓ వైపు కరోనా మరోవైపు డెంగ్యూ తో పాటు సీజనల్ వ్యాధులు(Seasonal Diseases) ప్రబలుతున్నాయి. తాజా పరిస్థితులు చూస్తుంటే డెంగ్యూ జ్వరాల కేసులు రోజు రోజుకు పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. గత పది రోజులుగా రాష్ట్రంలో డెంగ్యూ కేసులు(Dengue Cases) పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్య నిపుణులు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్లేట్ లెట్స్‌ పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎవరికైనా డెంగ్యూ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని కోరుతున్నారు.


డెంగీ ఉన్నప్పుడు అయిదు రోజుల వరకు జ్వరం 101 నుంచి 105 డిగ్రీల వరకు ఉంటుంది. ఎముకలు విరిగినట్టు నొప్పులుంటాయి. అందుకే దీన్ని బ్రేక్ బోన్ ఫీవర్(Break Bone Fever) అని కూడా అంటారు. డెంగీ ఉన్నప్పుడు శరీరంపై దద్దుర్లు కూడా రావొచ్చు. దీన్ని నిర్ధారించడానికి డెంగీ రాపిడ్ డిటెక్షన్ టెస్టు, యాంటి జెన్ టెస్టు అనే ప్రత్యేక పరీక్షలు చేస్తున్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  Twitter , Facebook