Dengue Cases: డెంగ్యూ కేసుల ముప్పుంది, తస్మాత్ జాగ్రత్త, ప్లేట్‌లెట్ కౌంట్ పెంచే చిట్కాలేంటి
Dengue Cases: వర్షాకాలం, చలికాలాల్లో డెంగ్యూ భయం పొంచి ఉంటుంది. ప్రస్తుతం డెంగ్యూ జ్వరాలు పెరుగుతున్నాయి. డెంగ్యూ నివారణకు ఏం చేయాలి, ప్లేట్‌లెట్ కౌంట్ ఎంత ఉండాలనేది బేసిక్ వివరాలు మీ కోసం..
Dengue Cases: వర్షాకాలం, చలికాలంలో ఎదురయ్యే పలు వ్యాధుల్లో అతి ప్రమాదకరమైంది డెంగ్యూ. దోమకాటు కారణంగా సోకే డెంగ్యూ..నిర్లక్ష్యం చేసినా లేదా సకాలంలో చికిత్స తీసుకోకపోయినా ప్రాణాంతకం కావచ్చు. ప్రస్తుతం దేశంలోని పలు ప్రాంతాల్లో డెంగ్యూ కేసులు ఎక్కువౌతున్న పరిస్థితి. డెంగ్యూ నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్లేట్‌లెట్ కౌంట్ ఎలా పెంచాలనేది తెలుసుకుందాం..
ఇటీవల కొద్దికాలంగా అంటే వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి డెంగ్యూ వ్యాధి కేసులు పెరుగుతున్నాయి. డెంగ్యూ వచ్చిందంటే చాలు ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా తగ్గిపోయి ప్రాణాంతకంగా మారుతుంది. డెంగ్యూలో ప్లేట్‌లెట్ కౌంట్ అనేది చాలా ముఖ్యమైనది. ప్లేట్‌లెట్స్ కౌంట్ ఎంత ఉండాలి, ఎలా ప్లేట్‌లెట్స్ కౌంట్ పెంచుకోవాలనేది తెలుసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. డెంగ్యూ కాకుండా ఇతరత్రా వ్యాధుల్లో కూడా ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గుతుంటుంది.
ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గడం
అప్లాస్టిక్ అనీమియా, లుకేమియా, లింఫోమా, డెంగ్యూ, వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు తెల్ల రక్తకణాలతో పాటు ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిపోతుంది. డెంగ్యూలో అయితే గంట గంటకూ కౌంట్ పడిపోతుంటుంది. వెంటనే ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గినప్పుడు రోగికి రక్తస్రావం లేదా అంతర్గత రక్తస్రావం జరిగే అవకాశముంటుంది. అటువంటప్పుడు ప్లేట్‌లెట్స్ ఎక్కించకపోతే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.
ప్లేట్‌లెట్ కౌంట్ ఎంత ఉండాలి
ఆరోగ్యవంతుడైన మనిషి శరీరంలో ప్లేట్‌లెట్ల సంఖ్య 3-4 లక్షల వరకూ లేదా ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది 80 వేల వరకూ పడిపోయినా ఎటువంటి నష్టం లేదు. కానీ 20 వేలకంటే దిగువకు పడిపోయినప్పుడు మాత్రం ప్రమాదకరంగా భావిస్తారు. రోగి ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుంది. వెంటనే అదే గ్రూప్ బ్లడ్‌గ్రూప్‌కు సంబంధించి ప్లేట్‌లెట్స్ ఎక్కించాల్సి ఉంటుంది. బ్లడ్ బ్యాంకులోల దాతలిచ్చిన రక్తంలో ఉండే మూడు అంశాల్ని వేరుచేస్తారు. ఎర్రరక్తకణాలు, ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ను విడదీసి..వేర్వేరుగా ప్యాక్ చేస్తారు. ప్లేట్‌లెట్స్ అవసరమైనవారికి ఎక్కిస్తుంటారు.
ప్లేట్‌లెట్ కౌంట్ పెరిగే అద్భుత చిట్కా
సహజ పద్దతిలో అందరికీ తెలిసిన మరో పద్థతి ఉంది. తక్షణం శరీరంలో ప్లేట్‌లెట్స్ కౌంట్‌ను పెంచుతుంది. బొప్పాయి చెట్టు లేత ఆకుల రసం. ఇది చాలా సులభం. లేత ఆకుల్నించి ఎప్పటికప్పుడు కొద్దిగా రసాన్ని సేకరించాలి. 5 ఎంఎల్ నుంచి 10 ఎంఎల్ వరకూ ప్రతిరోజూ ఉదయం , రాత్రి తీసుకుంటే చాలా వేగంగా ప్లేట్‌లెట్ కౌంట్ పెరుగుతుంది. ఇతర మందులు వాడుతూ కూడా ఈ రసం తీసుకోవచ్చు. చాలామంది వైద్యులు కూడా ప్రస్తుతం ఇదే సూచిస్తున్నారు. ప్లేట్‌లెట్స్ కౌంట్ తక్షణం పెంచేందుకు అద్భుతమైన హోమ్ రెమిడీ ఇది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook