Diabetes Control Drink: మధుమేహం ఉన్నవారు ఖచ్చితంగా పలు ఆహారాలను నియమాలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తిసుకునే ఆహారంలో తిపి అధికంగా ఉండే ఆహారాలను అస్సలు తీసుకోవద్దని నిపుణులు తెలుపుతున్నారు. అయితే చాలా మందిలో తినే  కార్బోహైడ్రేట్ల పరిమాణం రక్తంలో చక్కెరను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడం ముఖ్యం. కాబట్టి ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. దీని కారణంగా శరీరంలోని చక్కెర పరిమాణాలు తగ్గే అవకాశాలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే చాలా మంది  డయాబెటిస్ ఉన్నవారు  జీరో క్యాలరీలు ఉన్న పానీయాలు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. లేక పోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే దీని కోసం ఈ కింద సూచించిన పలు డ్రింక్స్‌ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ఈ నేచురల్ డ్రింక్స్ డయాబెటిక్ పేషంట్స్  కోసం..


1. నీరు:
శరీరం హైడ్రేట్‌గా ఉండడాని చాలా మంది వివిధ రకాల డ్రింక్స్‌ తాగుతూ ఉంటారు. అయితే మధుమేహంతో బాధపడుతున్నవారు కచ్చితంగా బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. తగినంత మోతాదులో నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అదనపు గ్లూకోజ్‌ను తొలగించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా వీరు ప్రతి రోజూ 3.08 లీటర్లు తాగాల్సి ఉంటుంది.


2. గ్రీన్ టీ:
గ్రీన్ టీ శరీరానికి చాలా అవసరం. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. గ్రీన్ టీని రోజూ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. అంతేకాకుండా చాలా వ్యాధి గ్రస్తుల్లో ఇది ప్రభావవంతంగా పని చేసిందని నిపుణులు తెలుపుతున్నారు.


3. కాఫీ:
మధుమేహం ఉన్నవారు కాఫీ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీని వల్ల చక్కెర జీవక్రియ మెరుగుపడుతుంది. అలాగే టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. అయితే ఈ కాఫీ తీసుకునే క్రమంలో చక్కెర వేసుకోక పోవడం చాలా మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.  


4. తక్కువ కొవ్వు ఉన్న పాలు:
పాలో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో  ఖనిజాల పరిమాణం ఎక్కువగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారు  కొవ్వు తక్కువగా ఉన్న పాలను తీసుకోవడం చాలా మంచిది. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంగా దృఢంగా కావడమేకాకుండా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి.


5. నిమ్మరసం:
నిమ్మరసంలో శరీరానికి అవసరమైన చాలా రకాల మూలకాలు ఉంటాయి. అంతేకాకుండా చాలా మంది ఇళ్లలో సులభంగా లభిస్తాయి. అయితే ఇందులో షుగర్ కంటెంట్ జీరో ఉంటుంది. కాబట్టి ఈ రసాన్ని ఆహార పదార్థాల్లో వినియోగిస్తే మధుమేహం సులభంగా నియంత్రణలో ఉంటుంది.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE TELUGU NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read:Krishnam Raju Died: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత


Also Read: Horoscope Today September 11th 2022: నేటి రాశి ఫలాలు... చంద్ర బలంతో ఈ రాశుల వారికి అంతా మంచే జరుగుతుంది.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook