Diabetes Control In 8 Days: ప్రస్తుతం చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల చాలా మంది మధుమేహం వంటి తీవ్ర వ్యాధులు కూడా వస్తున్నాయి. అయితే మధుమేహం సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు శరీరంలో చక్కెర పరిమాణాలు పెరగడమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి మధుమేహంతో, డయాబెటిస్‌ లక్షణాలతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీరు తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు మధుమేహం ప్రాణాంతకంగానూ మారే ఛాన్స్‌ ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహాన్ని నియంత్రించడానికి తప్పకుండా రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ను వినియోగించడమేకాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు ఆకులను కూడా వినియోగించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి.


మధుమేహం నియంత్రణ ఈ ఆకులు తప్పని సరి:
వేప ఆకులు:

వేప ఆకుల్లో ఫ్లేవనాయిడ్స్, యాంటీ వైరల్ సమ్మేళనాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కాబట్టి రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించుకోవడానికి వేప ఆకులను ఎండబెట్టాలి. తర్వాత వాటిని మిక్సీ జార్‌లో వేసి పౌడర్‌గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పౌడర్‌ను ప్రతి రోజు ఒక చెంచ తీసుకోవాలి. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.


మామిడి ఆకులు:
మామిడి కాయలు కాకుండా మామిడి ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదిని ఆయుర్వేద నిపుణులు పేర్కోన్నారు. మధుమేహాన్ని నియంత్రించేందుకు ఈ ఆకులు కూడా దోహదపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీని కోసం 10 నుంచి 15 మామిడి ఆకులను తీసుకోవాలి. వాటిని నీటిలో వేసి బాగా మరిగించి.. ఆ తర్వాత రోజు వడకట్టి తాగాడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రలో ఉంటాయి.


మెంతి ఆకులు:
మెంతికూరను ఆయుర్వేదంలో ఔషధంగా పరిగణిస్తారు. అందుకే ఆయుర్వేద నిపుణులు మెంతి ఆకులను మధుమేహ ఉన్నవారు ప్రతి రోజూ తీసుకోవాలని సూచిస్తారు. ఇందుకోసం మెంతి ఆకులను కూరగాయ లేదా సలాడ్‌గా చేర్చుకుని ప్రతి రోజూ తింటే రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.


కరివేపాకు:
కరివేపాకులో యాంటీ డయాబెటిస్‌ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ ఈ ఆకులను ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా కళ్లకు కూడా ప్రభావవంతంగా సహాయపడుతుంది.


(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read:  Thalapathy 67 Updates : లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలోకి సంజయ్ దత్.. విజయ్‌ సినిమా క్యాస్టింగ్ ఇద


Also Read: Sai Pallavi : జీవితంలో అవి ఉంటే చాలట.. నవ్వులు చిందిస్తున్న సాయి పల్లవి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook