Diabetes Tips: ఏ వయస్సులో ఎంత బ్లడ్ షుగర్ ఉండవచ్చు
Diabetes Tips: ఇటీవలి కాలంలో డయాబెటిస్ అతి పెద్ద సమస్యగా మారింది. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి. అప్రమత్తంగా ఉంటే ఎంత సులభంగా నియంత్రించవచ్చో..అజాగ్రత్తగా ఉంటే అంతే ప్రాణాంతకం కాగలదు.
Diabetes Tips: డయాబెటిస్ ఎప్పుడు ఎవరిని ఎలా ఎటాక్ చేస్తుందో అంచనా వేయలేం. ఒక్కోసారి సాధారణ లక్షణాలతో బయటపడటం కూడా కష్టమే. అందుకే ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలి. బ్లడ్ షుగర్ టెస్ట్ ఆరు నెలలకోసారి చేయించుకుంంటే మంచిదంటారు. అసలు ఏ వయస్సువారికి బ్లడ్ షుగర్ లెవెల్ ఎంత ఉండాలనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మధుమేహం అనేది అంత సులభమైంది కాదు. ఒకసారి వచ్చిందంటే ఇక అంతే. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి సోకిందంటే ఇక జీవితాంతం డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి. కచ్చితంగా జీవితాంతం వెంటాడే వ్యాధి ఇది. ఎందుకంటే ఇప్పటికీ పూర్తి స్థాయిలో చికిత్స లేదు. ఇండియాలో మధుమేహం ప్రతి 10 మందిలో ఐదారుగురికి ఉంటుందంటే అతిశయోక్తి అవసరం లేదు. కొన్నేళ్లముందైతే మధుమేహం వ్యాధి సాధారణంగా 45 ఏళ్లు దాటిన తరువాతే వచ్చేది. కానీ ఇప్పుడు అన్ని వయస్సులవారికి సోకుతోంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణ దాటితే ఈ వ్యాధి ప్రమాదకరంగా మారుతుంది. మధుమేహం కారణంగా శరీరంలో ఇంకా ఇతర అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. కంటి చూపు తగ్గడం, అధిక రక్తపోటు, గుండె వ్యాధులు, నీరసం వంటివి కన్పిస్తాయి. హెల్తీ డైట్, రోజూ తగినంత వ్యాయామం చేయడం ద్వారా డయాబెటిస్ నియంత్రించవచ్చు. అసలు ఏ వయస్సువారిలో ఎంత వరకూ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉండవచ్చో చూద్దాం.
18 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సుంటే భోజనం చేసిన గంటన్నర లేదా రెండు గంటల తరువాత 140 వరకూ ఉండవచ్చు. అదే ఫాస్టింగ్ అయితే 99 వరకూ ఉండవచ్చు. ఈ రెండింటికంటే ఎక్కువ ఉంటే ప్రమాదకరంగా భావించాల్సి వస్తుంది.
మీ వయస్సు 40 ఏళ్లుంటే ఎప్పటికప్పుుడు బ్లడ్ షుగర్ టెస్ట్ చేయిస్తుండాలి. ఎందుకంటే ఈ వయస్సులో ముప్పు ఎక్కువే ఉంటుంది. 40-50 ఏళ్ల వయస్సులో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ 90-130 వరకూ ఉండవచ్చు. అదే భోజనం తరువాత అయితే 140-150 వరకూ ఉండవచ్చు.
బ్లడ్ షుగర్ ఎలా నియంత్రించాలి
మీరు మధుమేహం వ్యాధిగ్రస్థులైతే ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రిస్తుండాలి. దీనికోసం హెల్తీ డైట్, ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి. రోజూ వాకింగ్ తప్పకుండా చేయాలి. ఉదయం బ్రేక్ ఫాస్ట్, మద్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ తరువాత కనీసం 5-7 నిమిషాలు లైట్ వాక్ అవసరం. అన్నింటికంటే ముఖ్యంగా ఆయిలీ ఫుడ్స్, మసాలా ఫుడ్స్, స్వీట్స్, ప్రోసెస్డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
Also read: Weight Loss: ఈ రంగు క్యారట్ తింటే 4 వారాల్లోనే అధిక బరువుకు చెక్, ఆ రోగాలు మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook