Diabetes: రూట్ వెజిటబుల్స్ రోజూ తీసుకుంటే ఆ వ్యాధి నుంచి ఉపశమనం ఖాయం
Diabetes: చలికాలంలో సహజంగా డయాబెటిస్ రోగులకు కష్టంగా ఉంటుంది. అందుకే డైట్‌పై తప్పకుండా దృష్టి సారించాలి. డయాబెటిస్ రోగులు చలికాలంలో కొన్ని రకాల కూరగాయల్ని డైట్‌లో చేర్చితే మంచి ఫలితాలు కన్పిస్తాయి.
మీరు డయాబెటిక్ రోగి అయితే..చలికాలంలో కాస్త జాగ్రత్త అవసరం. ముఖ్యంగా డైట్ విషయంలో కేర్ మరీ అవసరం. చలికాలంలో రూట్ వెజిటబుల్స్ డైట్‌లో చేర్చితే మీ బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది.
చలికాలం నడుస్తోంది. ఈ సమయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రోగ నిరోధక శక్తి తగ్గడంతో వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అదే సమయంలో డయాబెటిస్ రోగులకు సమస్య మరింత పెరుగుతుంది. అందుకే ఈ కాలంలో డైట్‌పై శ్రద్ధ చాలా అవసరం. డయాబెటిస్ రోగులు తమ డైట్‌లో కొన్ని రకాల కూరగాయలు చేర్చాల్సి ఉంటుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం కూడా. ముఖ్యంగా రూట్ వెజిటబుల్స్ తప్పకుండా తీసుకోవాలి.
టర్నిప్ అద్భుతమైన కూరగాయల్లో ఒకటి. ఇందులో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. దాంతోపాటు నీటి శాతం ఎక్కువ. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉపయోగపడతాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
డయాబెటిస్ రోగులకు బీట్‌రూట్ మరో అద్భుతమైన పదార్ధం. బీట్‌రూట్ తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఎందుకంటే ఇందులో బీటాలేన్, నియో బీటానిన్ పుష్కలంగా ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
చలికాలంలో క్యారట్ చాలా పుష్కలంగా లభిస్తుంది. ఇందులో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. కూర, సలాడ్, జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.
ముల్లంగిలో అద్భుతమైన పోషక గుణాలున్నాయి. ఫలితంగా బ్లడ్ షుగర్ నియంత్రణలో దోహదపడతాయి. డయాబెటిస్ నియంత్రణకు ప్రతిరోజూ ముల్లంగి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
Also read: Amla Benefits: ఉసిరి అందరికీ మంచిది కాదా, ఎవరెవరు ఉసిరి కాయలు తినకూడదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook