Diabetes Control Tips For Patients: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా... దేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ పెరుగుతున్నారు. డయాబెటిస్ ను నియంత్రించడానికి అన్ని చర్యలు తీసుకున్న తర్వాత కూడా మందులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వీరు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించాలంటే ఈ కింది టిప్స్ పాటించండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేయించిన ఆహారానికి దూరంగా ఉండండి:
డయాబెటిస్ ఉన్న వారు వేయించినా ఆహారం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. తద్వారా బ్లడ్ షుగర్ లెవెల్ బ్యాలెన్స్ కాకపోతే మీ సమస్య మరింత పెరగవచ్చు. అందుకే వేయించిన ఆహారానికి దూరంగా ఉండండి. 


పిండితో చేసినవి తినకండి:
డయాబెటిక్ రోగులకు పిండి అనారోగ్యకరం. వీరు పిండితో చేసిన వస్తువులకు దూరంగా  ఉండాలి. ఎందుకంటే వీటిని తీసుకుంటే మీ రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. నిజానికి, పిండిలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది మీ సమస్యను మరింత పెంచుతుంది.


బంగాళాదుంప తినవద్దు:
బంగాళాదుంపను భారతీయ వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు, అయితే మధుమేహ రోగులకు బంగాళాదుంప విషం అని మీకు తెలుసా. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్ తోపాటు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా ఎక్కువగా ఉండటం వల్ల మధుమేహ సమస్యలు పెరుగుతాయి.


రుచిగల పెరుగు తినవద్దు:
డయాబెటిక్ రోగులు కూడా రుచిగల పెరుగును తినకూడదు. నిజానికి, రుచిగల పెరుగులో చక్కెర పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు, అనేక రకాల కృత్రిమ పదార్ధాలు ఇందులో ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను పెంచుతాయి.


Also Read: Hearing Problem: ఈ అలవాట్లు మానుకోకపోతే వినికిడి లోపం రావడం గ్యారెంటీ! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook