Hearing Problem: ఈ అలవాట్లు మానుకోకపోతే వినికిడి లోపం రావడం గ్యారెంటీ!

Hearing Problem: చెవి అనేది మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. ప్రతిరోజు మనం ఇతరులతో కమ్యూనికేట్ అయ్యేందుకు సహకరిస్తుంది. కానీ, కొన్ని చెడు అలవాట్ల మూలంగా చిన్న వయసులోనే వినికిడి లోపం సమస్య వస్తుంది. ఆ లోపాన్ని నివారించుకోవడానికి ఈ రెండు అలవాట్లను తప్పనిసరిగా మానుకోవాలి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2022, 12:54 PM IST
Hearing Problem: ఈ అలవాట్లు మానుకోకపోతే వినికిడి లోపం రావడం గ్యారెంటీ!

Hearing Problem: మీకు కూడా వినికిడి (చెవుడు) సమస్య ఉందా? లేక ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు పెద్ద గొంతుతో మాట్లాడుతున్నారా? ఈ రెండు పరిస్థితులు వినికిడి లోపానికి లక్షణాలు కావచ్చు. కొందరికి వయసురీత్యా వినికిడి లోపం వస్తుంది. ఈరోజుల్లో చిన్న వయసులోనే చాలా మందికి వినికిడి సమస్యలు ఎదురువుతున్నాయి. వాటికి ప్రధాన కారణం చెడు అలవాట్లే అని వైద్యులు అంటున్నారు. కొన్ని అలవాట్లు మానుకోవడం వల్ల వినికిడి సమస్యను నివారించుకోవచ్చని వారు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

వినికిడి లోపం లక్షణాలు

వినికిడి లోపం సమస్య ఉన్నప్పుడు అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో ఈ లక్షణాలపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

1) ఎక్కువ సౌండ్ తో టీవీ చూడటం

2) రేడియో లేదా పాటలను ఎక్కువ సౌండ్ తో వినడం

3) సంభాషణలను వినడంలో.. అర్థం చేసుకోవడంలో ఇబ్బంది

4) చెవి నుండి తెలియని శబ్దం

5) ఫోన్‌లో వినికిడి లోపం.. బిగ్గరగా మాట్లాడటం వంటి లక్షణాలు వినికిడి లోపాన్ని సూచిస్తాయి. 

ఈ రెండు అలవాట్లు చెవిటి తనాన్ని కలిగిస్తాయి..

ఏ వయసులో వారికైనా వినికిడి లోపం రావచ్చు. అయితే వయసు పెరిగే కొద్దీ వినికిడి లోపం తగ్గడం సహజం. 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కాకుండా.. కొన్ని అలవాట్ల కారణంగా వినికిడి లోపాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటి రెండు ప్రమాదకరమైన అలవాట్లు ఏవో తెలుసుకుందాం. 

1. చెవులను తడిగా ఉంచుకోవడం

మీరు తరచుగా చెవులను తడిగా ఉంచుకుంటే తస్మాత్ జాగ్రత్త. అలా చేయడం వల్ల చెవిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ (ఆటోమైకోసిస్) వస్తుంది. ఈ సమస్య ఎక్కువగా ఈతగాళ్లలో కనిపిస్తుంది. చెవిలో ఇన్ఫెక్షన్‌కు కారణం ఆస్పర్‌గిల్లస్, కాండిడా అనే బ్యాక్టీరియా. ఇది తేమ కారణంగా వేగంగా వ్యాపిస్తుంది.

2. ఎక్కువ సౌండ్ తో సంగీతాన్ని వినడం..

మీరు ఎక్కువ సౌండ్ తో సంగీతాన్ని వినడానికి ఇష్టపడితే వెంటనే ఆ అలవాటు మార్చుకోండి. ఎందుకంటే దాని వల్ల మీ చెవులు దెబ్బతినే అవకాశం ఉండడం సహా వినికిడి శక్తిని క్రమంగా కోల్పోయే ప్రమాదం ఉంది. 

వినికిడి లోపానికి ఇతర కారణాలు

- కుటుంబంలో పెద్దల జన్యుపరమైన సంక్రమణ

- చెవిపోటులో లోపం

- ఎక్కువ శబ్దాన్ని చేసే యంత్రాల వద్ద పనిచేయడం 

వినికిడి లోపాన్ని నివారించేందుకు చిట్కాలు

- చెవుల్లో ఇయర్‌బడ్‌లు, పిన్‌లను మళ్లీ మళ్లీ పెట్టుకోవద్దు

- స్నానం చేసేటప్పుడు చెవిలో నీళ్లు పోసుకోవడం మానుకోవాలి

- పెద్ద పెద్ద శబ్దాల నుంచి చెవులను కాపాడుకునేందుకు చెవుల్లో దూది పెట్టుకోవాలి. 

- ఎక్కువ సౌండ్ తో టీవీ, పాటలు వినడం మానుకోవాలి. 

(నోట్: ఈ సమాచారమంతా కొన్ని చిట్కాల నుంచి గ్రహించబడినది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించడం మేలు. దీన్ని Zee తెలుగు News ధ్రువీకరించడం లేదు.)      

Also Read: Pomegranate Diabetes: షుగర్ వ్యాధిగ్రస్తులు దానిమ్మ జ్యూస్ తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Also Read: Henna for Hair: జుట్టుకు హెన్నా రాసుకునే వాళ్లు కచ్చితంగా ఈ నిజాలను తెలుసుకోవాలి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News