Diabetes Control Tips: మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది  మధుమేహం వ్యాధితో బాధపడుతున్నారు. ఈ మధుమేహం ప్రస్తుతం ప్రాణాంతక వ్యాధిలా మారింది. అయితే ఈ సమస్యలతో బాధపడుతున్న వారు కచ్చితంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకుంటే రక్తంలో చక్కెర స్థాయి అదుపు తప్పి ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొన్నారు. డయాబెటిక్ పేషెంట్లు అనేక రకాల ఆహారాలకు దూరంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా చీజ్‌ లాంటి ఆహారం తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఈ కూరగాయలు అస్సలు తినకూడదు. అవేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డయాబెటిస్ పేషెంట్ 4 కూరగాయలు తినకూడదు:


1. బంగాళదుంప:


బంగాళాదుంపను కూరగాయలలో రారాజుగా పిలుస్తారు. ఇందులో స్టార్చ్‌, కార్బోహైడ్రేట్లు చాలా అధికంగా ఉంటాయి. అందువల్ల డయాబెటిక్ పేషెంట్లు బంగాళాదుంప ఆధారిత చీజ్‌లైణ్ బర్గర్‌లు, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్ వంటివి తినకూడదు.


2. మొక్కజొన్న:


మొక్కజొన్న తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నా మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటికి దూరంగా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అరకప్పు మొక్కజొన్నలో దాదాపు 21 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.


3. గ్రీన్ పీస్:


పచ్చి బఠానీలలో కార్బోహైడ్రేట్లు, స్టార్చ్‌ల స్థాయి అధికంగా ఉంటాయి. దీనిని అధికంగా వినియోగించడం వల్ల మధుమేహ రోగుల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడే అవకాశాలున్నాయి.  


4. చిలగడదుంప:


చిలగడదుంప ఒక గొప్ప కూరగాయ అనడంలో సందేహం లేదు. ఇందులో కార్బోహైడ్రేట్లు, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇది తినడం వల్ల మధుమేహం వ్యాధి తీవ్రమయ్యే అవకాశాలున్నాయి.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: Mucus In Lungs: ఛాతీలో కఫం సమస్యలతో బాధపడుతున్నారా.. ఇలా సులభంగా విముక్తి పొందండి..!


Also Read: Covid 19 Fourth wave: భారత్ లో కొవిడ్ ఫోర్త్ వేవ్ మొదలైందా? 7 వేలు దాటిన రోజువారీ కేసులు కేసులు..కేంద్ర సర్కార్ హై అలర్ట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook