Covid 19 Fourth wave: భారత్ లో కొవిడ్ ఫోర్త్ వేవ్ మొదలైందా? 7 వేలు దాటిన రోజువారీ కేసులు కేసులు..కేంద్ర సర్కార్ హై అలర్ట్

Covid 19 Fourth wave in india: దేశంలో కొవిడ్ ఫోర్త్ వేవ్ మొదలైనట్టేనా అంటే అవుననే సమాధానమే వస్తోంది కేంద్ర వైద్యశాఖ అధికారుల నుంచి. దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగిపోయాయి. రోజువారీ కేసుల సంఖ్య ఏడు వేలు దాటింది. గత 24 గంటల్లో ఏకంగా 7 వేల 240 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

Written by - Srisailam | Last Updated : Jun 9, 2022, 10:15 AM IST
  • దేశంలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు
  • గత 24 గంటల్లో 7,240 కేసులు
  • అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు
Covid 19 Fourth wave: భారత్ లో కొవిడ్ ఫోర్త్ వేవ్ మొదలైందా? 7 వేలు దాటిన రోజువారీ కేసులు కేసులు..కేంద్ర సర్కార్ హై అలర్ట్

Covid 19 Fourth wave in india: దేశంలో కొవిడ్ ఫోర్త్ వేవ్ మొదలైనట్టేనా అంటే అవుననే సమాధానమే వస్తోంది కేంద్ర వైద్యశాఖ అధికారుల నుంచి. దేశంలో కొవిడ్ కేసులు భారీగా పెరిగిపోయాయి. రోజువారీ కేసుల సంఖ్య ఏడు వేలు దాటింది. గత 24 గంటల్లో ఏకంగా 7 వేల 240 కొత్త కొవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటి పోల్చితే ఏకంగా 2 వేల కొత్త కేసులు పెరగడం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. బుధవారం 5 వేల 2 వందలకు పైగా కేసులు నమోదు కాగా.. ఒక్క రోజులోనే అ సంఖ్య 7 వేల 2 వందలకు చేరడం వైద్య వర్గాలను కలవరపరుస్తోంది.

గత 24 గంటల్లో వైరస్ నుంచి 3 వేల 591మంది కోలుకున్నారు.  దేశంలో రికవరీల సంఖ్య 98.71 శాతంగా ఉంది. మహమ్మారి సోకి మరో 8 మంది చనిపోయారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 32 వేల 498కి పెరిగింది.దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 4,31,97,522కు పెరిగింది.

READ ALSO: Gang Rape Case Update: పోలీస్ కస్టడీకి గ్యాంగ్ రేప్ కేసు నిందితుడు.. బడాబాబుల లింకులు బయటపడేనా?

READ ALSO: Shamshabad Rape: అడ్డా కూలీపై అత్యాచారం, దాడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలి మృతి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News