Diabetes Control Tips: మధుమేహంతో బాధపడే వారు ఈ నియమాలు పాటిస్తే.. 10 రోజుల్లో చెక్ పెట్టొచ్చు..!
Best Foods For Diabetics: ప్రస్తుతం చాలా మంది మధుమేహం బరినపడుతున్నారు. అంతేకాకుండా దీని కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. అయితే ఈ నమస్యలతో బాధపడే వారు తప్పకుండా పలు రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది.
Best Foods For Diabetics: ప్రస్తుతం చాలా మంది మధుమేహం బరినపడుతున్నారు. అంతేకాకుండా దీని కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యల బారినపడుతున్నారు. అయితే ఈ నమస్యలతో బాధపడే వారు తప్పకుండా పలు రకాల ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి రోజూ తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే వీరిలో తీవ్ర మధుమేహంతో బాధపడుతుంటే తప్పకుండా వైద్యలును సంప్రదించడం చాలా మేలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవు. ముఖ్యంగా వీరు శరీరంలో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల త్వరలోనే రక్తంలో చక్కెర పరిమాణం తగ్గుతుంది.
ఎవరైనా డయాబెటిస్ లేదా ప్రీడయాబెటిస్ సమస్యలతో బాధపడుతుంటే.. కచ్చితంగా వీరు ఫైబర్ ఫుడ్‌ను తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించి..రక్తంలో గ్లూకోజ్ స్పైక్‌లను తగ్గిస్తుంది. దీంతో షుగర్ లెవల్స్ తగిన పరిమాణంలో ఉంటాయి.
ఈ ఫుడ్‌ను కచ్చితంగా తీసుకోవాలి:
1) వోట్స్:
వోట్స్‌లో తగిన పరిమాణంలో ఫైబర్ ఉంటుందిఒ. కావున శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయి. ముఖ్యంగా ఇందులో కరిగే ఫైబర్ కూడా అధిక పరిమాణంలో ఉంటుంది. ఇవి నేరుగా రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలపై ప్రభావం చూపి మధుమేహాన్ని నియంత్రిస్తాయి. అంతేకాకుండా శరీరంలో బ్యాక్టీరియాకు సహాయక ప్రీబయోటిక్‌గా కూడా పనిచేస్తుంది.
2) గోధుమలు:
గోధుమల్లో 6 గ్రాముల ఫైబర్ కరిగే ఫైబర్ పరిమాణం ఉంటుంది. రక్తంలో చక్కెర పరిమాణంపై ప్రభావం చూపి కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ముఖ్యంగా శరీరపై వచ్చే వాపుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
3) ఆపిల్:
ఆరోగ్య నిపుణులు సూచించిన ప్రకారం.. ప్రతి రోజూ ఒక ఆపిల్ పండును తినడం వల్ల శరీరంలో వచ్చే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షిస్తుందని పేర్కొన్నారు. ఇవి మధుమేహాం బారిన పడకుండా చేస్తాయని నిపుణులు పేర్కొన్నారు.
4) సబ్జా విత్తనాలు
డయాబెటిక్ రోగులకు సబ్జా గింజలు ప్రభావవంతంగా ఉపయోగపడుతాయి. ఎందుకంటే వీటిలో అధిక ఫైబర్ కంటెంట్ పిండి పదార్థాలను గ్లూకోజ్‌గా మార్చేందుకు సహాయపడుతుంది. జీవక్రియను కూడా మెరుగు పరిచేందుకు సహాయపడుతుంది. కావున మధుమేహంతో బాధపడే వారు తప్పకుండా సబ్జా విత్తనాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read:ED on Casino: క్యాసినో వ్యవహారంలో సినీ తారలు..నోటీసులకు సిద్ధమవుతున్న ఈడీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook