ED on Casino: క్యాసినో వ్యవహారంలో సినీ తారలు..నోటీసులకు సిద్ధమవుతున్న ఈడీ..!

ED on Casino: క్యాసినో వ్యవహారంలో తన విచారణను ఈడీ వేగవంతం చేసింది. మనీలాండరింగ్‌పై కూపీ లాగుతున్నారు. విచారణలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నట్లు తెలుస్తోంది.

Written by - Alla Swamy | Last Updated : Aug 3, 2022, 10:06 AM IST
  • క్యాసినో వ్యవహారం
  • మూడో రోజు ఈడీ విచారణ
  • మనీలాండరింగ్‌పై ప్రశ్నల వర్షం
ED on Casino: క్యాసినో వ్యవహారంలో సినీ తారలు..నోటీసులకు సిద్ధమవుతున్న ఈడీ..!

ED on Casino:  క్యాసినో అంశంలో మూడోరోజు ఈడీ విచారణ కొనసాగుతోంది. విదేశాలకు భారీ నగదు బదిలీపై లోతుగా విచారిస్తున్నారు. హవాలా చెల్లింపులపై అధికారులు కూపీ లాగుతున్నారు. మొదటి, రెండు రోజుల్లో సుదీర్ఘంగా విచారించి ఈడీ.. మూడో రోజు సైతం ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. క్యాసినో ఏజెంట్ చికోటి ప్రవీణ్‌, అతడి అనుచరుడు మాధవరెడ్డిలు మూడో రోజు విచారణకు హాజరయ్యారు. 

క్యాసినో పేరుతో విదేశాలకు తరలించిన నగదు ఎంత..ఎవరిది అనే కోణంలో విచారణ సాగుతోంది. విదేశీ బ్యాంక్‌ ఖాతాలను ఇప్పటికే ఈడీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌ హవాలా చెల్లింపుల్లో ఏజెంట్ల పాత్రపై విచారణ జరుపుతున్నారు. ఈకేసులో సినీ స్టార్స్, రాజకీయ నేతలు, వీఐపీల పాత్రపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈడీ నోటీసుల ఊహాగానాలపై అనుమానితుల్లో ఆందోళన నెలకొంది. 

పలువురు ప్రముఖుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. దీంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. విచారణ అనంతరం పలువురు ప్రముఖులకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆ దిశగా ఈడీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. నేపాల్‌లోని ఓ హోటల్‌లో జరిగిన క్యాసినోలో ఎవరెవరు పాల్గొన్నారు. ఎంత మేర డబ్బులు చేతులు మారింది అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నేపాల్‌ టూ హైదరాబాద్‌ మధ్య ఏం జరిగిందన్న దానిపై కూపీ లాగుతున్నారు.

నేపాల్‌లోని ఓ హోటల్‌లో క్యాసినో వ్యవహారం వెలుగు చూసింది. ఇందులో మనీలాండరింగ్ జరగడంతో ఈడీ రంగంలోకి దిగింది. ఆ మూలాలన్నీ హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో క్యాసినో ఏజెంట్ చికోటి ప్రవీణ్‌, అతని అనుచరుల ఇళ్లల్లో మూడురోజులపాటు తనిఖీలు నిర్వహించారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. చికోటి ప్రవీణ్‌కు పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈడీ విచారణ అనంతరం కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. 

Also read:Rohit Sharma Injury: ఆసియా కప్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ.. రోహిత్ శర్మ ఔట్!

Also read:Achyuthapuram SEZ: అచ్యుతాపురం సెజ్‌లో మళ్లీ గ్యాస్ లీకేజ్.. 100 మంది మహిళలకు తీవ్ర అస్వస్థత..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News