Diabetes Diet Chart: మధుమేహం రావడానికి ప్రధాన కారణం శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ పరిమాణం తగ్గడం వల్లనని నిపుణులు చెబుతున్నారు. ఈ హార్మోన్ తగ్గడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు కార్బోహైడ్రేట్లు వేగంగా పెరుగుతాయి. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు కొందరిలో ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మధుమేహంతో బాధపడుతున్న వారు పలు రకాల ఆహారాలు డ్రైఫ్రూట్స్ ప్రతిరోజు తినడం వల్ల సులభంగా రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రించవచ్చు. అయితే మధుమేహాని నియంత్రించడానికి వేటిని ఆహారంలో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీటిని తప్పకుండా ఆహారంలో తీసుకోవాలి:
పిస్తా పలుకులు:

పిస్తా పలుకుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్న వీటిని తినడం వల్ల సులభంగా నియంత్రించుకోవచ్చు. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


చిరోంజి:
చిరోంజీ గింజలు కూడా రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషకాలు సాధారణ గ్లూకోజ్ స్థాయిలను ప్రభావితం చేయడానికి వీటిని ప్రతిరోజు పాలలో కలుపుకొని తీసుకోవాల్సి ఉంటుంది. 


బాదం:
బాదం లో చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అందుకే పోషకాహార లోపం సమస్యతో బాధపడుతున్న వారికి వీటిని తినమని వైద్యులు సూచిస్తారు. ఇందులో ఫైబర్, విటమిన్-ఇ, విటమిన్-బి12, మెగ్నీషియం అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి బాదం ను ప్రతిరోజు ఆహారంలో వినియోగిస్తే అందులో ఉండే పోషకాలు రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.


వేరుశనగ:
వేరుశనగ నూనెను ఆహారాల్లో వినియోగిస్తే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడానికి వేరుశెనగ ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మధుమేహాన్ని నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.


జీడిపప్పు:
జీడిపప్పులో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉన్నాయి. వీటిని ప్రతి రోజు తినడం వల్ల  షుగర్, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. నానబెట్టిన జీడిపప్పు తినడం మధుమేహంతో బాధపడుతున్న వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి.


(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


ఇది కూడా చదవండి : Republic Day 2023: రిపబ్లిక్ డే టికెట్ బుకింగ్ ధరలు, చీఫ్ గెస్ట్, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు


ఇది కూడా చదవండి : Parliament New Building Photos: పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ఫోటోలు.. పాతదానికి, కొత్తదానికి డిజైన్ తేడా చూడండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook