Republic Day 2023: రిపబ్లిక్ డే టికెట్ బుకింగ్ ధరలు, చీఫ్ గెస్ట్, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు

Republic Day 2023 Interesting Facts: జనవరి 26, రిపబ్లిక్ డే 2023 సమీపిస్తున్నందున గణతంత్ర దినోత్సవం 2023 పై రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథి ఎవరు ? గణతంత్ర దినోత్సవం 2023 పరేడ్ జరిగే రూట్ ఏంటి ? రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ టికెట్స్ ఎవరు ఇస్తారు ? ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయా ? ఎంత ఖరీదు అవుతుంది వంటి అనేక రకాల సందేహాలు చాలామందిని వేదిస్తుంటాయి.

Written by - Pavan | Last Updated : Jan 18, 2023, 10:26 PM IST
  • రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యం ఏంటి ? ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం ?
  • రిపబ్లిక్ డే 2023 సెలబ్రేషన్స్‌కి చీఫ్ గెస్ట్‌గా ఎవరు హాజరు కానున్నారు ?
  • రిపబ్లిక్ డే 2023 థీమ్ ఏంటి ?
  • రిపబ్లిక్ డే 2023 వేడుకలను నేరుగా వీక్షించేందుకు టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి ?
Republic Day 2023: రిపబ్లిక్ డే టికెట్ బుకింగ్ ధరలు, చీఫ్ గెస్ట్, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు

Republic Day 2023 Interesting Facts: ఇండియాలో 1950 నుండి ప్రతీ సంవత్సరం జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే జనవరి 26, 2023న భారత్ 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటోంది. జనవరి 26, 1950న మన భారత రాజ్యాంగం అమల్లోకి రావడాన్ని స్మరించుకుని, గౌరవించుకుంటూ పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో పాటు దేశవ్యాప్తంగా ఎంతో ఆనందంగా, గుండెల నిండా దేశభక్తితో జరుపుకునే దేశభక్తి పండగే ఈ గణతంత్ర దినోత్సవం.

ప్రతీ సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకలను జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్‌పథ్ మార్గంలో నిర్వహిస్తారు. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ.. ఇలా భారత త్రివిధ దళాల భాగస్వామ్యంతో ప్రతీ సంవత్సరం పెద్ద ఎత్తున రిపబ్లిక్ డే పరేడ్ జరుగుతుంది. దేశం నలుమూలల నుంచే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరైనా.. ఎక్కడి నుంచైనా ఈ వేడుకలను టీవీలో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఇంకా వీలైతే వ్యక్తిగతంగా ఢిల్లీలో పరేడ్ వేడుకలకు సంబంధించిన ఎంట్రీ పాసులు తీసుకోవడం ద్వారా నేరుగా వేడుకలను వీక్షించవచ్చు.

జనవరి 26, రిపబ్లిక్ డే 2023 సమీపిస్తున్నందున గణతంత్ర దినోత్సవం 2023 పై రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథి ఎవరు ? గణతంత్ర దినోత్సవం 2023 పరేడ్ జరిగే రూట్ ఏంటి ? రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ టికెట్స్ ఎవరు ఇస్తారు ? ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయా ? ఎంత ఖరీదు అవుతుంది వంటి అనేక రకాల సందేహాలు చాలామందిని వేదిస్తుంటాయి. అలాంటి సందేహాలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

రిపబ్లిక్ డే 2023 సెలబ్రేషన్స్‌కి చీఫ్ గెస్ట్‌గా ఎవరు హాజరు కానున్నారు ?
ఈ ఏడాది జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా అల్-సిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

గణతంత్ర దినోత్సవం 2023లో జెండా ఎగురవేసే సమయం
గణతంత్ర దినోత్సవ పరేడ్ 2023 ప్రత్యక్ష ప్రసారం కర్తవ్య పథ్ నుండి ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఎప్పటిలాగే ప్రధాని నరేంద్ర మోదీ అమర్ జవాన్ జ్యోతిని సందర్శించిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. 

రిపబ్లిక్ డే పరేడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎంత దూరం జరుగుతుంది ?
భారత్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్ జనవరి 26న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుండి రాజ్‌పథ్, ఇండియా గేట్ మార్గాల ద్వారా ఎర్రకోట వరకు కొనసాగుతుంది. పరేడ్ జరిగే ఈ మార్గం మొత్తం 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉంటుంది. 

రిపబ్లిక్ డే 2023 థీమ్ ఏంటి ?
ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్‌లో మూడు థీమ్స్ ప్లాన్ చేశారు. అందులో ఒకటి ఇండియా@75 కాగా రెండోది 2023 ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ థీమ్ కానుంది. ఇక మూడో థీమ్‌ లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. నారీ శక్తి. అంటే మహిళా శక్తి లేదా మహిళా సాధికారత అన్నమాట. ఈ మూడు థీమ్స్‌లో ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు లేదా మూడింటి కలయికను ఎంచుకుని రిపబ్లిక్ డే వేడుకల్లో వారి కళారూపాలను ప్రదర్శించవచ్చు. ఈ మేరకు రక్షణ శాఖ నుండి ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, పలు విభాగాలకు ఆహ్వానాలు వెళ్లాయి. 

ఇండియాకు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుపుకుంటున్న గణతంత్ర దినోత్సవ వేడుకలు కావడంతో ఇండియ@75 థీమ్ ప్లాన్ చేశారు. ఇందులో భారత స్వాతంత్ర్య పోరాటం, గత ఏడు దశాబ్దాలుగా సాధించిన విజయాలు వంటి అంశాలతో కళారూపాలను ప్రదర్శించాల్సి ఉంటుంది.

ఇక 2023ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్‌గా ప్రకటించాలని కోరుతూ భారత్ ఐక్యరాజ్య సమితిలో 2021 లో ఒక ప్రతిపాదన తీసుకురాగా.. ఈ ప్రతిపాదనకు 72 దేశాలు మద్దతు పలికాయి. దీంతో భారత్ డిమాండ్ మేరకు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని మరొక థీమ్‌గా తీసుకున్నారు. ఇక చివరి థీమ్ అయిన నారీ శక్తి / మహిళా సాధికారతకు భారత్ ఎప్పుడూ పెద్దపీట వేస్తోన్న సంగతి తెలిసిందే. 

రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కోసం మూడు రకాల కేటగిరీలలో టికెట్స్ విక్రయిస్తారు. అందులో ఒకటి రూ. 20 కేటగిరి కాగా రెండోది రూ. 100 కేటగిరి. ఇక మూడో కేటగిరిలో ఒక్కో టికెట్ ఖరీదు 500 రూపాయలు ఉంటుంది. రక్షణ శాఖ ఆధ్వర్యంలోని అధికారిక వెబ్‌సైట్ https://www.aamantran.mod.gov.in/login ద్వారా రిపబ్లిక్ డే 2023 సెలబ్రేషన్స్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి : Republic Day 2023: భారత దేశంలో మొదటి 'రిపబ్లిక్ డే' ఎక్కడ జరిగిందో తెలుసా?.. రాజ్‌పథ్‌లో మాత్రం కాదు!

ఇది కూడా చదవండి : Attacks on Ram Temple: అయోధ్యలో రామ మందిరంపై ఉగ్రదాడులకు కుట్ర

ఇది కూడా చదవండి : iPhone 14 Price Offers: ఐఫోన్ 14 పై సంక్రాంతి ధమాకా.. 44 వేల భారీ డిస్కౌంట్ ఆఫర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News