Diabetes Diet: మధుమేహం అనేది పూర్తిగా ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వచ్చే ప్రమాదకర వ్యాధి. ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకుంటే చాలావరకూ నియంత్రించవచ్చు. అదే నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రమాదకరంగా మారుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆధునిక జీవన విధానంలో ఎక్కువగా కన్పించే వ్యాధుల్లో ఒకటి డయాబెటిస్. నియంత్రణ ఎంత సులభమో నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదకరం. అందుకే డయాబెటిస్ సోకినప్పుడు తక్షణం చేయాల్సింది డైట్ కంట్రోల్, లైఫ్‌స్టైల్ మార్పు. తద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించవచ్చు. ఎందుకంటే కొన్ని రకాల ఆహార పదార్ధాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. మరి కొన్ని ఆహార పదార్ధాలు తగ్గిస్తుంటాయి. చాలామంది డైట్‌పై శ్రద్ధ పెట్టకపోవడంతో డయాబెటిస్ అంతకంతకూ పెరిగి ప్రమాదకరంగా మారుతుంటుంది. ఈ క్రమంలో మధుమేహం వ్యాధిగ్రస్థులకు వెజ్ మంచిదా నాన్ వెజ్ మంచిదో తెలుసుకుందాం..


ఫ్యాటీ ఫిష్


డయాబెటిస్ ఉన్నా లేకున్నా ఫ్యాటీ ఫిష్ అనేది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందుకే సాధ్యమైనంతవరకూ ఫ్యాటీ ఫిష్ డైట్‌లో భాగంగా చేసుకోవాలి. దీనికోసం సాల్మన్, ఎంకోవీ వంటి చేపలు తినడం మంచిది. ఇందులో పుష్కలంగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, డీహెచ్ఏ, ఈపీఏలు గుండెను డయాబెటిస్ దుష్పరిణామాల్నించి కాపాడుతాయి. అంతేకాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రిస్తాయి. స్వెల్లింగ్ తగ్గుతుంది. ధమనుల పనితీరు మెరుగుపడుతుంది. సాధారణంగా మధుమేహం ఉంటే గుండె వ్యాధుల సమస్య పెరుగుతుంది. అందుకే డైట్‌లో ఈ తరహా చేపలుంటే ఆ పరిస్థితి తప్పించవచ్చు. అంతేకాకుండా చేపల్లో ఉండే ప్రోటీన్లు ఆరోగ్యానికి ప్రయోజనకరం. ఎక్కువసేపు ఆకలి వేయకుండా అదుపు చేస్తాయి. ఫలితంగా చేపలు వెయిట్ లాస్ ప్రక్రియలో కూడా దోహదపడతాయి.


ఆకు కూరలు


ఆకు కూరలు ఆరోగ్యానికి ది బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో దాదాపు అన్ని రకాల పోషకాలుంటాయి. ఇతర కూరగాయలతో పోలిస్తే ఆకు కూరల్లో డైజెస్టివ్ కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. అంటే ఆకు కూరలు ఎంత తిన్నా..బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగవు. అందుకే రోజువారీ డైట్ లో తోటకూర, పాలకూర, మెంతి కూర, చుక్క కూర వంటివి తరచూ మార్చి మార్చి తింటుండాలి. దీనివల్ల విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. అంతే కాకుండా టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు రక్తంలో చక్కెర శాతం నియంత్రించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆకుకూరల్లో ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మధుమేహం నుంచి కళ్లను కూడా రక్షిస్తాయి.


Also read: National Tourism Day: దేశంలోని టాప్ 5 అందమైన, అద్భుతమైన ద్వీపాలివే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook