Diabetes Tips: డయాబెటిస్..అత్యంత ప్రమాదకర వ్యాధి. జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం సులభంగా నియంత్రించుకోవచ్చు. డయాబెటిస్ ఉన్నవాళ్లు ఆహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్రమత్తంగా ఉంటే ఎంత సులభంగా నియంత్రించుకోవచ్చో..నిర్లక్ష్యంగా ఉంటే అంతే ప్రమాదకరంగా మారే వ్యాధి డయాబెటిస్. షుగర్ వ్యాధి అని కూడా పిలుస్తారు. అందుకే మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే చాలు..డయాబెటిస్ నియంత్రణ సాధ్యమే. అదెలాగో పరిశీలిద్దాం..


ముఖ్యంగా రాత్రిళ్లు తీసుకునే ఆహారం విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంతవరకూ రాత్రిపూట తేలికపాటి ఆహారం మంచిది. రాత్రిళ్లు కార్బోహైడ్రేట్లు, తీపి పదార్ధాలు తీసుకోవడం మానేయాలి. మధుమేహ వ్యాధిగ్రస్థులు రాత్రి సమయంలో సూప్ తీసుకుంటే చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కూరగాయలతో చేసిన జ్యూస్ ఆరోగ్యకరం. ఇది త్వరగా జీర్ణమవుతుంది కూడా. రాత్రి డిన్నర్‌లో సాధ్యమైనంతవరకూ పచ్చి ఆకుకూరలు, బీన్స్, కొబ్బరి వంటివి మిక్స్ చేసి తింటే బలంతో పాటు ఆరోగ్యం కూడా. 


ఇక మధుమేహంతో బాధపడేవారు రాత్రిపూట ఓట్స్, రాగులు, మిల్లెట్స్‌తో తయారు చేసే రోటీలు, పప్పులు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. జీర్ణవ్యవస్థ మెరుగుదలకు ఇది చాలా మంచిది కూడా. ఒకవేళ రాత్రిళ్లు పెద్గగా ఆకలి లేకపోతే..ఏమీ తినాలని లేకపోయినా...దాల్చిన చెక్కతో మరగబెట్టిన గ్లాసు నీరు తాగడం మంచిది. దాల్చినచెక్క..మధుమేహాన్ని నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రాత్రిపూట స్వీట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ముఖ్యంగా రాత్రిళ్లు వేయించిన ఆహార పదార్ధాలు తినకూడదు. 


Also read: White Hair Treatment: చింతపండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook