Diabetes Home Remedies: మధుమేహం దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ప్రమాదకర వ్యాధి. రక్తంలో చక్కెర శాతం పెరగడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నియంత్రణ తప్ప సంపూర్ణ చికిత్స లేదు. అందుకే చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహం నియంత్రణ అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్చుకోవడం ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్స్ అద్భుతంగా నియంత్రించవచ్చు. అదే సమయంలో ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాల్లో లభించే అద్భుతమైన ఔషధాలతో డయాబెటిస్ వ్యాధికి చెక్ చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రతి కిచెన్‌లో తప్పకుండా లభించే సోంపు, వాము, జీలకర్రతో డయాబెటిస్ వ్యాధిని నియంత్రించవచ్చు. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా ఉండకపోవడం వల్ల రక్తంలో చక్కెర శాతం పెరిగిపోతుంది. డయాబెటిస్ రోగుల ఆహారం, జీవనశైలి మార్చాల్సి ఉంటుంది.


ప్రతి భారతీయ కిచెన్‌లో లభ్యమయ్యే సోంపు, వాము, జీలకర్రతో మధుమేహం నియంత్రణ సాధ్యమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటి ద్వారా బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. సోంపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ చక్కెర సంగ్రహణను మందగించేలా చేస్తుంది. అటు వాములో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇక జీలకర్రలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు టైప్ 2 డయాబెటిస్ ముప్పు తగ్గించేందుకు దోహదపడతాయి.


సోంపు, వాము, జీలకర్రను నిర్ణీత రూపంలో వినియోగిస్తే బ్లడ్ షుగర్ అద్భుతంగా నియంత్రణలో వస్తుందని పలు అధ్యయనాల్లో స్పష్టమైంది. ఈ మసాలా పదార్ధాలు తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ముప్పు చాలావరకూ తగ్గుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో వచ్చేస్తాయి. ఎందుకంటే సోంపు, వాము, జీలకర్ర మధుమేహం వ్యాధిగ్రస్థులకు సహజసిద్ధమైన ఔషధమని చెప్పవచ్చు. ఇవి వాడటం ద్వారా డయాబెటిస్ మందులకు సైతం చెక్ చెప్పవచ్చంటున్నారు.


సోంపు, వాము, జీలకర్రను చాలా రకాలుగా ఉపయోగించవచ్చు. టీ రూపంలో లేదా కూరల్లో కలుపుకుని తీసుకోవచ్చు. లేదా మూడింటినీ సమాన పరిమాణంలో తీసుకుని పౌడర్ చేసుకుని ఉంచుకోవాలి. పౌడర్ చేసేముందు మూడింటినీ కొద్దిగా రోస్ట్ చేస్తే మంచిది. తరువాత రోజూ ఒక స్పూన్ పౌడర్ గోరువెచ్చని నీళ్లలో కలుపుకుని భోజనం తరువాత తీసుకోవాలి.


Also read: Weight Loss: మొక్కజొన్న రొట్టెలతో బరువు తగ్గడం సులభంగా గురూ..ఇలా 10 రోజుల్లో పొట్ట మాయం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook