Diabetes Control With Drumsticks: మధుమేహం తీవ్ర దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధి బారిన ఒక్కసారి పడితే మరణించే దాకా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఈ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేకపోతే రక్తంలో చక్కెర పరిమాణాలు క్రమంగా పెరిగి ప్రాణాంతకంగానూ మరే ఛాన్స్‌ ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగినప్పుడు తప్పకుండా  పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవడానికి నిపుణులు సూచించిన పలు ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మునగ ఆకులను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. మునగ ఆకులతోనే కాకుండా చెట్టు ప్రతి భాగంలో మూలకాలు లభిస్తాయి. వీటిని వినియోగించడం వల్ల సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. డయాబెటిస్ ఉన్నవారికి మునగ ఎలాంటి ప్రయోజనాలను చేకూర్చుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షుగర్ వ్యాధికి నియంత్రిస్తుందా..?
డయాబెటిస్‌తో బాధపడేవారు మునగను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిపై ప్రభావవం చూపుతాయి.  ఇన్సులిన్ కణాల పనిని వేగవంతం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియ రేటును కూడా పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. మునగలో ఉండే ఇన్సులిన్ లాంటి ప్రోటీన్లు రక్తంలో చక్కెరను తగ్గించడానికి సహాయపడతాయి. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


డ్రమ్ స్టిక్ కర్రీని ఇలా తయారు చేసుకోండి..
ముందుగా మునగను తీసుకుని నీటిలో ఉడికించాల్సి ఉంటుంది. వాటిని పక్కన పెట్టి..ప్యాన్‌పై మరో మరో బౌల్‌ పెట్టి అందులో నూనె వేసి పోపు దినుసులను వేసి చిటపటలాడించాలి. అందులోనే ముక్కలుగా కట్‌ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమోటాలు వేసుకుని బాగా వేయించుకోవాల్సి ఉంటుంది. అందులోనే ఉడికించిన మునగ  స్టిక్స్‌ వేసి కొద్ది సేపు వేయించాల్సి ఉంటుంది. ఓ 5 నిమిషాల తర్వాత  కొత్తిమీర గార్నీష్ చేసి వడ్డించుకుంటే రుచితో పాటు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.


మునగకాయ వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు..
మునగకాయ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు దీన్ని రోటీ, అన్నంతో తినడం వల్ల మధుమేహం సులభంగా నియంత్రణలో ఉంటుంది. తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అల్పాహారం లేదా రాత్రి భోజనం సమయంలో కూడా తినవచ్చు. ఇలా క్రమం తప్పకుండా తీసుకుంటే ఊబకాయం, గుండె సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


ఇది కూడా చదవండి : 3 Lakhs Discount Cars: మార్చి బొనాంజా.. ఈ 5 కార్లపై 3 లక్షల వరకు తగ్గింపు! బెస్ట్ ఎస్‌యూవీ కొనడానికి ఉత్తమ సమయం ఇదే


ఇది కూడా చదవండి : Best Hatchback Cars: బెస్ట్‌ హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే..రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్‌!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook