Diabetes Symptoms: మధుమేహం లక్షణాలు కళ్లలో కన్పిస్తాయా, అవేంటో తెలుసా
Diabetes Symptoms in Telugu: ఇటీవలి కాలంలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధుల్లో మధుమేహం ఒకటి. ఒకసారి సోకిందంటే జీవితాంతం వెంటాడుతుంది. శరీరంలోని అనేక ఇతర అవయవాల్ని సైతం ప్రభావితం చేస్తుంది. అందుకే డయాబెటిస్ సోకితే ఆ లక్షణాలు శరీరంలోని వివిధ భాగాల్లో బయటపడుతుంటాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Diabetes Symptoms in Telugu: రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను అమాంతం పెంచేస్తుంది మధుమేహం. ఇన్సులిన్ ఉత్పత్తిని లేదా వినియోగంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దాంతో రక్తంలో చక్కెర నేరుగా కలిసి బ్లడ్ షుగర్‌కు కారణమౌతుంది. మధుమేహం వ్యాధి లక్షణాలు కళ్లలో కూడా కన్పిస్తాయని చాలామందికి తెలియదు. అందుకే కంటి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.
మనిషి శరీరంలో ఉండే ఇన్సులిన్ అనే హార్మోన్ బ్లడ్ షుగర్ కణాల్లో చేరేందుకు సహాయపడుతుంది. మధుమేహం సోకడమంటే ఇన్సులిన్ ఉత్పత్తి లేదా వినియోగంలో సమస్య వచ్చినట్టు అర్ధం. ఈ పరిస్థితుల్లో తినే ఆహారంలో ఉండే చక్కెర..మాల్టోజ్, ఫ్రక్టోజ్‌గా మారకుండా నేరుగా రక్తంలో కలిసిపోతుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. మధుమేహం ఉంటే శరీరంలోని వివిధ అంగాలపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కళ్లపై ప్రతికూల ప్రబావం చూపించవచ్చు. మధుమేహం ఉంటే కళ్లలో చాలా మార్పులు కన్పిస్తాయి. కంటి చూపు తగ్గడానికి కూడా కారణం కావచ్చు. ప్రీ డయాబెటిక్ దశలో కళ్లలో కొన్ని మార్పులు లేదా లక్షణాలు స్పష్టంగా చూడవచ్చు. కళ్లలో కన్పించే ఆరు ముఖ్యమైన లక్షణాలు లేదా సంకేతాలతో డయాబెటిస్ సోకిందో లేదో చెప్పవచ్చు.
డయాబెటిస్‌తో కళ్లలో కన్పించే లక్షణాలు
డయాబెటిస్ కారణంగా కంటి కండరాలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆలసట, తలనొప్పి వస్తాయి. ఇక కళ్లు దురదగా, డ్రైగా మారవచ్చు. ఇది కూడా ఒక లక్షణమే. మూడో లక్షణం కంటి కండరాలు, నరాలు దెబ్బ తినడం. దాంతో చూపు మసకగా ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం.
ఇక నాలుగో లక్షణం కళ్లలో నల్లని మచ్చలు , మెరుపు కన్పించడం గమనించవచ్చు. ఇది డయాబెటిస్ విట్రియస్ హెమరేజ్ లక్షణం కావచ్చు. కళ్లలో బ్లీడింగ్ కూడా ఉంటుంది. కళ్లలో నొప్పి కూడా డయాబెటిక్ రెటినోపతి లక్షణం. కంటి రక్త నాళాలకు హాని కలుగుతుంది. డయాబెటిస్ కారణంగా రంగుల్ని గుర్తించే సామర్ధ్యం తగ్గిపోతుంది. దాంతో అన్ని రంగులు కళా విహీనంగా, ఫేడ్‌గా కన్పిస్తాయి. ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. డయాబెటిస్ ప్రారంభ దశలో చాలా సులభంగా నియంత్రించవచ్చు.
Also read: Platelet Count: డెంగ్యూ రోగులకు ఈ 5 పండ్లు దివ్య ఔషధంతో సమానం, ప్లేట్‌లెట్ కౌంట్ పెంచే అద్భుత మార్గం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook