Diabetic Care Tips: ఈ ఆకులతో ఎంతటి మధుమేహమైన దిగి రావడం ఖాయం..నమ్మట్లేదా ట్రై చేయండి!
Diabetes Control Leaf: మధుమేహంతో బాధపడేవారు ప్రతి రోజు కొన్ని ఆకులను తీసుకోవడం వల్ల సులభంగా రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల బారిన కూడా పడకుండా ఉంటారు.
Diabetes Control Leaf: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా ఆధునిక జీవనశైలిని పాటించే చాలా మంది తీవ్ర డయాబెటిస్ బారిన పడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా కళ్ల సమస్యలతో పాటు గుండె, మూత్రపిండాలు, పక్షవాతం వంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
శీతాకాలం కారణంగా ఈ మధుమేహంతో బాధపడేవారిలో రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరగడమే కాకుండా తగ్గుతూ ఉంటాయి. దీని కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి సమయంలో శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని ఆకు కూరలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి ఆకు కూరలను ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ ఆకులను తప్పకుండా తీసుకోవాలి:
వేప ఆకులు:
వేప ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వేప ఆకులను మధుమేహం ఉన్నవారు శీతాకాలంలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఈ ఆకులను ప్రతి రోజు నమిలి తినడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
అశ్వగంధ ఆకులు:
అశ్వగంధ ఆకుల గురించి ఆయుర్వేద శాస్త్రంలో క్లుప్తంగా వివరించారు. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారు అశ్వగంధ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను సులభంగా నియంత్రిస్తాయి. దీంతో పాటు అధిక బరువు, కొలెస్ట్రాల్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అశ్వగంధలో యాంటీబయాటిక్ రసాయనాలు పుష్కలంగా లభిస్తాయి. దీని కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..
కరివేపాకు:
కరివేపాకులో కూడా శరీరానికి కావాల్సిన యాంటీ-ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్‌లు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ రసాన్ని తాగడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. తరచుగా శీతాకాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఖాళీ కడుపుతో 6 నుంచి 8 వరకు కరివేకులను నమిలి తినాల్సి ఉంటుంది.
మెంతి ఆకులు:
మెంతి ఆకుల్లో కాల్షియం, ఐరన్, మాంగనీస్, విటమిన్ ఎ, బి6తో పాటు విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లావిన్, కాపర్, పొటాషియం వంటి అనేక పోషకాలు లభిస్తాయి. కాబట్టి ఈ ఆకులతో తయారు చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. దీంతో అనారోగ్య సమస్యల బారిన పడకుండా కూడా ఉంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook