7-Day Diet Plan For Weight Loss: ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే ప్రస్తుతం చాలా మంది శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి అనేక రకాల రసాయానలతో కూడిన పౌడర్‌లను కూడా ఉపయోగిస్తారు. వీటిని విచ్చల విడిగా వినియోగించడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా నిపుణులు సూచించి పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి ఈ పద్ధతులను అనుసరించండి:
తగినంత నిద్ర పొందండి:

శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి నిద్ర అవసరం. అందుకే రోజులో 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. ఎందుకంటే తక్కువ నిద్ర కారణంగా ఒత్తిడి, చిరాకు వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇవే కాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యలు కూడా రావొచ్చు. కాబట్టి శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి తగినంత సమయం నిద్రపోవాల్సి ఉంటుంది.


అతిగా నీటిని తాగాల్సి ఉంటుంది:
సరైన మోతాదులో నీరు తాగడం వల్ల కూడా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకొవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. నీటిని ఎక్కువగా తాగడం వల్ల టాక్సిన్స్ సులభంగా తొలగిపోతాయి. దీంతో శరీరం ఫిట్‌గా తయారవుతుంది. అందుకే రోజంతా 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


ఆరోగ్యకరమైన ఆహారం:
ప్రతి రోజూ ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటేనే శరీరం కూడా హెల్తీగా ఉంటుంది. అందుకే ఆహారంలో ప్రొటీన్లు, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే శరీర బలహీనత వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా మంచి ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ప్రతి రోజూ డ్రై ఫ్రూట్స్‌ని తీసుకోవాల్సి ఉంటుంది.


వ్యాయామం:
శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి రోజూ వ్యాయామాలు కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వ్యాయామం చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి ప్రతిరోజూ వ్యాయామం చేయడానికి ప్రయత్నించండి. దీంతో రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది.


(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also read: Ys jagan: ఏపీలో పెట్టుబడులకై స్వయంగా రంగంలో దిగిన సీఎం వైఎస్ జగన్, ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీ


Also read: Ys jagan: ఏపీలో పెట్టుబడులకై స్వయంగా రంగంలో దిగిన సీఎం వైఎస్ జగన్, ఇవాళ ఢిల్లీలో బిజీ బిజీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook