Maida Flour Side Effects: మైదా పిండిని ఉపయోగించి తయారు చేసిన వంటలు ఎంతో రుచిగా ఉంటాయి. మైదా పిండి గోధుమ పిండి నుంచి తయారువుతుంది. గోధుమలను మిల్లులో బాగా పోలిష్‌ చేస్తారు. గోధుమ పిండి చేసి అజో బై కార్పోనమైడ్, బెంజోయిల్ పెరాక్సయిడ్, క్లోరిన్ గ్యాస్ వంటి కెమికల్‌లతో దీని శుభ్రపరుస్తారు. వీటివల్లనే మైదా పిండి తెల్లగా మెత్తగా ఉంటుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇందులో బెంజోయిల్‌  పెరాక్సయిడ్, క్లోరిన్ గ్యాస్ ల వాడకాన్ని చైనా, ఐరోపా దేశాలలోను పూర్తిగా నిషేధించారు. ఈ మైదా తయారు చేయడానికి అల్లోక్సన్ అనే కెమికల్‌న్ని కూడా వినియోగిస్తారు. దీని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతారని చాలా దేశాల్లో నిషేధించారు. 


చాలా దేశాల్లో నిషేధించిన దక్షిణ భారత్ లో మాత్రం మైదాను ఎక్కువ వంటకాలలో ఉపయోగిస్తున్నారు.     అయితే మైదాకు తడి తగిలితే జిగురు పదార్థంగా మారుతుంది. దీని హోమ్ మేడ్ గమ్ గా ఉపయోగిస్తుంటారు. ఈ మైదాతో రవ్వ దోశలు, మిఠాయిలు, బ్రెడ్, బొప్పట్లు అంటూ వంట పదార్థాలు తయారు చేస్తారు. 


బేకరీలో లభించే బిస్కట్లు, చిప్స్ టిఫిన్ సెంటర్ లలో పరోటా, బొడా తయారీకి ఈ  మైదాను ఉపయోగిస్తారు. ఆరోగ్యనిపుణుల ప్రకారం దీని ఎక్కువగా తీసుకోవడం వల్ల  చాలా ఆనారోగ్య సమస్యలు వస్తాయి. మైదా పిండిని ఉపయోగించి చేసే వంటలు రుచిగా ఉన్నప్పటికి దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. 


Also Read  Reduce Bad Cholesterol: ఒంట్లో చెడు కొవ్వు వెన్నలా కరగడానికి ఈ ఒక్క డైట్‌ పాటిస్తే చాలు..


చిన్నపిల్లలు వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతారు. అంతేకాకుండా దీని వల్ల మలబద్దకం, గ్యాస్‌ వంటి సమస్యలు పిల్లలలో కనిపిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


మైదా పిండిన తమ వంటలలో ఎక్కువ వాడేవారకి డయాబెటిస్‌ సమస్యలను ఎదుర్కొంటారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇవేకాక కిడ్నీల్లో రాళ్లు, గుండె జబ్బులు వంటి సమస్యలు కూడా కలుగుతున్నాయి. అందుకే మైదాను మితంగా తీసుకోవడం చాలా మంచిది. దీని వల్ల  అనారోగ్య సమస్యలు పెరుగుతాయి కాబట్టి మీరు అధికంగా తీసుకుండ ఉండటం మంచిది. దీనికి బదులుగా మీరు సహజమైన పిండిని ఉపయోగించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. 


Also Read Ragi Dibba Rotte: రాగి దిబ్బరొట్టెను బ్రేక్‌ఫాస్ట్‌గా తింటే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter