Ragi Dibba Rotte: రాగి దిబ్బరొట్టెను బ్రేక్‌ఫాస్ట్‌గా తింటే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి!

Ragi Dibba Rotti Recipe: చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా , దృఢంగా ఉంటుంది. చిరుధాన్యాలలో ఎక్కువగా రాగులు, సజ్జలు, జొన్నలతో కలిగిన టిఫెన్స్‌ చేస్తుంటారు. అయితే రాగితో దిబ్బరొట్టెను ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 20, 2024, 10:42 PM IST
Ragi Dibba Rotte: రాగి దిబ్బరొట్టెను  బ్రేక్‌ఫాస్ట్‌గా తింటే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి!

Ragi Dibba Rotti Recipe: రాగులు , సజ్జలు, జొన్నలతో తయారు చేసిన వంటకాలను ఈ మధ్యకాలంలో చాలా మంది తింటున్నారు. దీని వల్ల ఆరోగ్యానికి అనేక లాభాలు కలుగుతున్నాయి. చిరుధాన్యాలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల శరీరం దృఢంగా , ఆరోగ్యంగా తయారు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మనం రాగితో వివిధ రకాల వంటకాలను తయారు చేసుకుంటాము. అయితే రాగి దిబ్బరొట్టెను కూడా తయారు చేసుకోవచ్చు. దీని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఈ దిబ్బ‌రొట్టెలు కాకుండా ఇలా వెరైటీగా ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని కోరుకునే వారికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. రాగుల‌తో దిబ్బ‌రొట్టెల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.!

రాగి దిబ్బ‌రొట్టెకి కావాల్సిన ప‌దార్థాలు:

మిన‌పప్పు  ఒక గ్లాస్, రాగి ర‌వ్వ మూడు గ్లాసులు,ఉప్పు  త‌గినంత.

రాగి దిబ్బ‌రొట్టె ఎలా చేసుకోవాలి: 

ముందుగా మినపప్పను నీటితో శుభ్రం చేసుకోవాలి. తరువాత నాలుగు గంటల పాటు వీటిని నానబెట్టుకోవాలి. ఆ తరువాత మినపప్పును ఒక జార్‌లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. రాగి రవ్వను శుభ్రంగా కడిగి నీటిని పిండేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ముందుగా తీసుకున్న పిండిలోకి కలుపుకోవాలి. దీని రాత్రంతా పులియబెట్టాలి. పిండిఒ పులిసిన తరువాత ఇందులో ఉప్పు వేసి క‌ల‌పాలి. స్ట‌వ్ మీద మందంగా ఉండే క‌ళాయిని ఉంచి నూనె వేసుకోవాలి.

పిండి వేసి పైన మ‌ర‌లా నూనె వేసుకుని మూత పెట్టాలి. దీనిని ఏడు నిమిషాల పాటు కాల్చుకున్న త‌రువాత నెమ్మ‌దిగా క‌ళాయి నుంచి వేరు చేసి పెనం మీద వేసుకోవాలి. నూనె వేసి చ‌క్క‌గా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రాగి దిబ్బ రొట్టె త‌యార‌వుతుంది. 

ఈ రాగి దిబ్బరొట్టెను మీరు ఉదయం పూట పిండిలోకి ఉల్లితరుగు, పచ్చిమిర్చి, క్యారెట్‌ తురుము, కొత్తిమీర కూడా వేసుకోని తినవచ్చు. దీనిని చ‌ట్నీ, సాంబార్‌తో తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. రాగులను ఎలా వాడినా ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఇలాంటి వెరైటీస్‌ చేసి తినడం వల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది. దీని చిన్న పిల్లలకు తినిపించడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News