Muskmelon Seeds Benefits: ఎండకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో ఖర్జూజా  మర్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఈ సమ్మర్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మనల్ని రోజంతా హైడ్రేటేడ్‌గా ఉంచుతుంది. అయితే, వీటి గింజల్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.  ఈ ఖర్జూజా గింజలతో సులభంగా బరువు తగ్గొచ్చు. ఈ పండును ఖర్జూజా ఇంగ్లిష్‌లో మస్క్‌మిలన్ అని కూడా పిలుస్తారు. ఈ ఖర్జూజా గింజలను క్యాంటలోప్‌ గింజలు అని కూడా పిలుస్తారు.అయితే, మనం సాధారణం ఖర్జూజాను తిని వాటి గింజలను పారేస్తాం. కానీ, ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీర్ణ ఆరోగ్యం..
ఖర్జూజా గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని ప్రేరేపిస్తాయి. ఫైబర్ సరైన మోతాదులో తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యలు దరిచేరవు. ఇది పేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది. గట్‌ హెల్త్‌ను ఖర్జూజా గింజలు ఎంతో మెరుగుపరుస్తాయి.


పోషకాల నిధి..
ఖర్జూజా గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులు, డైటరీ ఫైబర్, విటమిన్ ఏ, సీ, ఇ పుష్కలంగా ఉంటాయి. ఐరన్, మెగ్నిషియం, పొటాషియం అనే ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ ఖర్జూజా గింజలను మీ డైట్లో చేర్చుకోవడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.


ఇదీ చదవండి: వచ్చే నెలలో సంపూర్ణ సూర్యగ్రహణం.. మన దేశంపై ప్రభావం ఉంటుందా?


ఎముక ఆరోగ్యం..
ఖర్జూజా గింజల్లో కావాల్సినంత ఖనిజాలు ఉంటాయి. ఇందులో కాల్షియం, మెగ్నిషియం, ఫాస్పరస్ ఉంటాయి. ఇవి మన ఎముక ఆరోగ్యాన్ని కాపాడతాయి. ముఖ్యంగా పంటి ఆరోగ్యానికి కూడా మంచివి. దీంతో అస్టియోపోరోసిస్ నుంచి కూడా దూరంగా ఉంచుతుంది.


గుండె ఆరోగ్యం..
ఖర్జూజా గింజల్లో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్‌, ఓమేగా 3, ఓమేగా 6 యాసిడ్స్ ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఖర్జూజా గింజలు గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా కాపాడతాయి. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించి కార్డియోవాస్క్యూలర్ ఆరోగ్యంగా ఉండటానికి ప్రేరేపిస్తాయి.


యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు.. 
ఖర్జూజా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, సీ, ఫ్లేవనాయిడ్స్, కెరొటోనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కు గురికాకుండా కాపాడతాయి. దీంతో ప్రాణాంతక వ్యాధుల నుంచి కూడా మనం దూరంగా ఉండొచ్చు.


ఇదీ చదవండి: హోలీ రోజు ఏ రాశి వారు ఏ కలర్ తో హోలీ ఆడాలో తెలుసా?


బరువు నిర్వహణ..
సాధారణంగా ఖర్జూజా గింజల్లో కేలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇలా సమతుల ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన బరువు నిర్వహించవచ్చు. ఇది భోజనం మధ్యలో ఏ ఇతర చిరుతుళ్లు తినాలనే కోరికను తగ్గిస్తుంది. దీంతో బరువు పెరగకుండా ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook