Fruit Juice On Empty Stomach: పండ్లలో పోషకాలు అధికంగా ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పండ్లు తింటే ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండొచ్చని మనలో చాలా మంది అనుకుంటారు. అయితే కొందరు ఎక్కువగా పండ్లను జ్యూస్‌గా చేసుకుని తాగుతూ ఉంటారు. దీంతో శరీరానికి వెంటనే ఎనర్జి వచ్చి.. అది బూస్టర్‌గా పని చేస్తుందని చాలా మంది అభిప్రాయం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఉదయాన్నే మనం తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పరగడుపున తీసుకునే ఆహారం లేదంటే పానీయం విషయంలో జాగ్రత్త అవసరం. పర గడుపున జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం.


ఉదయాన్నే ఖాళీ కడుపుతో జ్యూస్ తాగడం వల్ల మలబద్ధకం, ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. డిన్నర్, బ్రేక్ ఫాస్ట్ మధ్య ఎక్కువ సమయం మన కడుపు ఖాళీగా ఉండడమే ఇందుకు కారణం. ముఖ్యంగా పుల్లని పండ్లతో తయారు చేసిన జ్యూస్‌లను అస్సలు తీసుకోకూడదు. ఆరెంజ్, సీజనల్ పండ్లు, నిమ్మకాయ వంటి వాటితో తయారు చేసిన జ్యూస్‌ పరగడుపు తీసుకోకూడదు.


ఉదయాన్నే ఖాళీ కడుపుతో జ్యూస్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ పరగడుపున జ్యూస్ తాగకండి. ఇక మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉదయం పూట జ్యూస్ అస్సలు తాగకూడదు. ఒకవేళ.. పొరపాటున ఖాళీ కడుపుతో జ్యూస్ తాగితే.. ఆ తర్వాత ఒక గంట వరకు ఏమీ తినకుండా ఉండాలి. ఎందుకంటే జ్యూస్ తీసుకున్న తర్వాత ఏదైనా తింటే వాంతులు కావడం, కడుపులో తిప్పడం.. వికారంలాంటివి కలగవచ్చు. అలాగే విరేచనాలు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఖాళీ కడుపుతో ఫ్రూట్ జ్యూస్‌ తాగకండి. తాగితే మాత్రం రిస్క్ తప్పదు.


Also Read: Giloy Benefits: తిప్పతీగ తింటే లివర్‌ పాడవుద్దా?.. కేంద్రం ఏం చెబుతోంది?


Also Read: Viral Video: ఈ ఛాన్స్ పోతే మళ్లీ రాదన్నట్టు స్టెప్పేసిన నవ వధువు.. చూస్తే షాకే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.