Giloy Benefits: తిప్పతీగ తింటే లివర్‌ పాడవుద్దా?.. ఇందులో నిజమెంత, కేంద్రం ఏం చెబుతోంది?

Tippa Teega Liver: తగిన మోతాదులో తీసుకుంటే తిప్ప‌తీగ‌ ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ఎటువంటి విష ప్రభావాన్ని చూపదని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2022, 08:41 PM IST
  • తిప్పతీగ తింటే లివర్‌ పాడవుద్దా?
  • ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏం చెబుతోంది?
  • తిప్ప‌తీగ‌ ఆరోగ్యానికి మేలు
Giloy Benefits: తిప్పతీగ తింటే లివర్‌ పాడవుద్దా?.. ఇందులో నిజమెంత, కేంద్రం ఏం చెబుతోంది?

Tippa Teega Safe to Use in Appropriate Doses: క‌రోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ క‌ష్ట‌కాలంలో చాలా మంది వైరస్ నుంచి కాపాడుకునేందుకు సాంప్ర‌దాయ వైద్యం వైపు వెళ్లారు. కొందరు ఇంట్లోనే ఇంట్లోనే క‌షాయాలు తయారు చేసుకుంటే.. మరికొందరు ఆయుర్వేదం వైపు వెళ్లారు. ఇంకొందరు వ‌న మూలిక‌లను తీసుకున్నారు. ఈ క్రమంలోనే తిప్ప తీగ‌ ఆకులు తింటే.. క‌రోనా నుంచి రక్షించుకోవచ్చనే ప్ర‌చారం బాగా జరిగింది. ఈ నేప‌థ్యంలో దీనికి ఎన్న‌డూ లేని డిమాండ్ ఏర్ప‌డింది. కొంద‌రు ఇళ్ల‌లోనే తిప్ప తీగ‌ను పెంచుకోవ‌డం ప్రారంభించారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

2020 చివరలో తిప్ప‌తీగ వాడి కాలేయం దెబ్బ‌తిన్న ఆరుగురు పేషెంట్ల‌కు ముంబై డాక్ట‌ర్లు చికిత్స చేశారు. ఈ ఆరుగురిలో ప‌చ్చ‌కామెర్లు, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి సమ‌స్య‌లు ఉన్నట్లు డాక్ట‌ర్లు స్పష్టం చేశారు. అంద‌రూ తినోస్పోరా కార్డిఫోలియా (తిప్ప‌తీగ‌) ఆకుల‌ను తిన్న‌ట్లు గుర్తించారు. తిప్ప‌తీగ‌ను తినడం వల్లనే 62 ఏళ్ల ఓ మ‌హిళ చికిత్స పొందుతూ మృతి చెందిందని డాక్ట‌ర్‌ ఆభా న‌గ్రాల్ వెల్ల‌డించారు. ఆపై కూడా తిప్ప‌తీగ‌ తింటే లివర్‌ చెడిపోతుంది చాలా నివేదికలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ బుధవారం స్పందించింది.

తగిన మోతాదులో తీసుకుంటే తిప్ప‌తీగ‌ ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ఎటువంటి విష ప్రభావాన్ని చూపదని ఆయుష్ మంత్రిత్వ శాఖ బుధవారం స్పష్టం చేసింది. 'ఆయుర్వేదంలో తిప్ప‌తీగ ఉత్తమ పునరుజ్జీవన మూలికగా పేర్కొనబడింది. తిప్ప‌తీగ వలన ఎటువంటి విష ప్రభావం ఉండదని డేటా చెపుతోంది. అయితే ఈ ఔషధంను ఎంత మోతాదులో తీసుంకుంటామనే దానిపై విష ప్రభావం ఆధారపడి ఉంటుంది. వైద్యుల సూచన మేరకు తగిన మోతాదులో తిప్ప‌తీగ‌ను తీసుకుంటే ఎలాంటి నష్టం ఉండదు' అని ఆయుష్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

వివిధ జీవక్రియ రుగ్మతలకు చికిత్స చేయడంలో తిప్ప‌తీగ‌ను ఉపయోగిస్తారు అని ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలిపింది. రోగనిరోధక శక్తి, మనిషి ఆయుష్షును పెంచే సామర్థ్యం కూడా ఉంటుందని పేర్కొంది. ఈ ఔషధాన్ని తీసుకుంటే జ్వరం వచ్చినా త్వరగా తగ్గిపోతుందని డాక్టర్లు అంటున్నారు. కిడ్నీ సంబంధ జబ్బులు, మధుమేహంతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు తిప్ప‌తీగ‌ను ఉపయోగించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

Also Read: Viral Video: ఈ ఛాన్స్ పోతే మళ్లీ రాదన్నట్టు స్టెప్పేసిన నవ వధువు.. చూస్తే షాకే!!

Also Read: టీమిండియా స్టార్ బౌలర్‌కు వార్నింగ్.. ఇక ఆడకుంటే అంతేసంగతులు అన్న బీసీసీఐ! ఇషాంత్‌, ఉమేష్ మాదిరే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News