COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Drinking Honey At Night Benefits: ప్రకృతి ద్వారా లభించే వాటిల్లో తేనె కూడా ఒకటి.. ఇది నోటికి తియ్యని రుచిని అందించడమే కాకుండా.. శరీరానికి బోలెడు లాభాలను అందిస్తుంది. అందుకే ప్రస్తుతం చాలామంది పంచదారకు బదులుగా తేనెను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం చాలామంది బరువు తగ్గడానికి తేనెను ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. ఊబకాయ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పూట గోరువెచ్చని నీటితో పాటు తేనెను తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా చాలామంది మధ్యాహ్నం పూట ఆహారంలో వినియోగిస్తూ ఉంటారు. అయితే రాత్రిపూట కూడా తేనెను వినియోగించడం వల్ల శరీరానికి మరిన్ని లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


రాత్రిపూట తేనెను తీసుకోవడం వల్ల సులభంగా ఒత్తిడి తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పాలీఫినాల్స్ ఒత్తిడిని తగ్గించడమే కాకుండా.. మనసును ప్రశాంతంగా చేసింది కూడా సహాయపడుతుంది. దీంతోపాటు నిద్రలేని సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు రాత్రి పడుకునే ముందు రెండు టీ స్పూన్ల తేనెను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


ఇందులో ఉండే గుణాలు గుండెపోటు రాకుండా కూడా గుండెను రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తేనెలో అధిక పరిమాణంలో యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు రాత్రిపూట తేనెను తీసుకోవడం వల్ల ట్రై గ్లిజరాయిడ్ స్థాయిలు కూడా తగ్గుతాయి. చాలామందిలో రాత్రి పడుకున్న తర్వాత విపరీతమైన దగ్గు వస్తుంది ఇలాంటి సమస్యలతో బాధపడే వారికి కూడా తేనె సహాయపడుతుంది. 


తేనెలో ఉండే ఔషధ గుణాలు దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్ల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా సులభంగా రోగనిరోధక శక్తిని పెంచి తీవ్ర వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని ప్రోటక్ట్ చేసేందుకు సహాయపడతాయి. ఇవే కాకుండా చర్మ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగించేందుకు తేనెను వినియోగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖంపై మొటిమలు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రభావిత ప్రాంతంలో రాత్రిపూట తేనె అప్లై చేసి ఉదయాన్నే శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.


ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి