Kalonji Water Benefits: ప్రస్తుతం చాలామందికి కలోంజీ గింజల గురించి తెలియదు. మనం తరచుగా బిస్కెట్లపై ఇతర ఆహారాలపై నల్లటి గింజలను చూస్తూ ఉంటాం. వీటిని వీటినే కలోంజి అని అంటారు. ఈ కలోంజి గింజలను తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీటి లాభాల గురించి కూడా ఆయుర్వేద శాస్త్రంలో క్లుప్తంగా వివరించారు. ఈ గింజలను నీటిలో నానబెట్టి ఆ మరుసటి రోజు తాగడం వల్ల శరీరానికి అనేక రకాల పోషకాలు అందుతాయి. అంతేకాకుండా చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే కలోంజీ విత్తనాలను తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే లాభాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కలోంజీ విత్తనాల వల్ల కలిగే లాభాలు:
రక్తంలోని చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి:

అధిక రక్తపోటుతో బాధపడేవారిలో సులభంగా మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా మధుమేహం కారణంగా రక్తంలోని చక్కర పరిమాణాలు క్రమంగా పెరగడమే కాకుండా తగ్గుతూ ఉంటాయి. అయితే ఇలా రక్తంలో చక్కెర స్థాయిల హెచ్చు తగ్గుల కారణంగా కిడ్నీలతో పాటు గుండె సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి రక్తంలోని చక్కెరను అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. అయితే ఇలాంటి సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు కలోంజి గింజలను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది. 


కొలెస్ట్రాల్ నియంత్రణకు:
కలోంజీ సీడ్స్ వాటర్ కొలెస్ట్రాల్ నియంత్రణ కూడా ప్రభావంతంగా సహాయపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పూట కలోంజీ సీడ్స్ వాటర్  ను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతిరోజు తీసుకోవడం వల్ల అతి త్వరలోనే శరీరంలోని కొలెస్ట్రాల్ కరిగి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్


శరీర బరువు నియంత్రణ కోసం:
కలోంజీ గింజలను నానబెట్టిన నీటిని తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా అధిక బరువు సమస్యలతో బాధపడేవారు ఈ నీటిని తాగడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఈ నీటిలో ఉండే ఆయుర్వేద గుణాలు బెల్లీ ఫ్యాట్ అని కూడా సులభంగా కరిగిస్తాయి. కాబట్టి అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ నీటిని ట్రై చేసి చూడండి.


Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి