Drumsticks Benefits: ఆరోగ్యం మహాబలం అంటారు. ఫిట్ అండ్ హెల్టీగా ఉండాలంటే తినే ఆహారం ఆరోగ్యంగా ఉండాలి. మనం తీసుకునే ఆహార పదార్ధాల్లో లభించే వివిధ రకాల పోషకాలలో శరీరం ఎదుగుదల, ఆరోగ్యానికి అవసరమయ్యే పోషకాలు లభిస్తాయి. ఇందులో కూరగాయల పాత్ర చాలా కీలకమని చెప్పవచ్చు. దాదాపుగా ఏడాది పొడుగునా లభించే మునక్కాయ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్లు, విటమిన్లు మునగలో చాలా పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ముప్పై ఏళ్లు దాటిన మహిళలు మునగాకు లేదా మునక్కాయను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా శరీరంలో పేరుకుపోయే కొవ్వు కూడా తగ్గుతుంది. శరీరానికి ఎలాంటి మినరల్స్ అవసరమో ఇందులో ఉండే ఫైటేట్స్ అనే యాంటీ న్యూట్రీయంట్లు సంగ్రహించగలవు. ఇవి మునగాకులో ఉంటాయి. అధిక రక్తపోటును నియంత్రించేందుకు కూడా మునగ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మునగలో ఉండే ఐసోధియోసైనేట్, నియోజిమైనిన్ వంటి న్యూట్రియంట్లు ధమనులను హార్డ్ కాకుండా చేస్తాయి. దాంతో స్ట్రోక్, హార్ట్ ఎటాక్ సమస్యలు చాలావరకు దూరమౌతాయి. 


ఆలోచనాశక్తిని పెంపొందించడంలో, మానసిక స్థితిని మెరుగుపర్చడంలో మునగలోని పోషకాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అధిక బరువు తగ్గించేందుకు కూడా మునగ కీలకంగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బరువు నియంత్రణలో ఉపయోగపడతాయి. మునగాకు లేదా మునక్కాయలు చర్మం, కేశ సంరక్షణకు అద్భుతంగా ఉపయోగపడతాయి. మునగ అనేది శరీరంలో నేచురల్ డీటాక్సిఫయర్‌గా పనిచేస్తుంది. 


Also read: RuPay Credit Card: ఇక క్రెడిట్ కార్డుతో యూపీఐ చెల్లింపులు, ఎలా లింక్ చేయాలంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook