Dry Cough Remedies: పొడి దగ్గుని సమూలంగా తగ్గించే 3 అద్భుత చిట్కాలు
Dry Cough Remedies: సీజన్ మారగానే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జలుబు, దగ్గు వంటి సమస్యలు సర్వ సాధారణంగా ఉంటాయి. ఒక్కోసారి పొడి దగ్గు తీవ్రంగా వేధిస్తుంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Dry Cough Remedies: దగ్గు అనేది కేవలం నలుగురిలో అసౌకర్యంగా ఉండటమే కాదు మీ దైనందిన కార్యక్రమాలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యం క్షీణించేలా చేస్తుంది. పొడి దగ్గు మరింత బాధాకరంగా ఉంటుంది. ఈ నేపధ్యంలో కొన్ని హోమ్ రెమిడీస్ ద్వారా పొడి దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు.
సీజన్ మారగానే చాలా రకాల వ్యాధులు ఎటాక్ చేస్తుంటాయి. వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు వెంటాడుతాయి. ఇందులో ఒకటి పొడి దగ్గు. పొడి దగ్గు ఒకసారి ప్రారంభమైందంటే అంత త్వరగా వదలదు. రాత్రుళ్లు అయితే మరింత అసౌకర్యంగా ఉంటుంది. దగ్గు కారణంగా నిద్ర పట్టదు. ప్రశాతమైన నిద్ర ఉండదు. రోజంతా అలసట, బద్ధకం ఇలా చాలా ఉంటాయి. ఒక్కోసారి దగ్గు సిరప్ లేదా ట్యాబ్లెట్స్ వాడినా ఫలితం కన్పించదు. ఈ క్రమంలో కొన్ని హోమ్ రెమిడీస్ సహాయంతో ఈ సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు.
నల్ల మిరియాలు తేనె
నల్ల మిరియాలు తేనె అనేది దగ్గు జలుబు సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. దీనికోసం 4-5 మిరియాలు పౌడర్ చేసి తేనెతో కలిపి తినాలి. రోజూ పరగడుపున తరువాత 1-2 సార్లు తీసుకుంటే పొడి దగ్గు నుంచి సత్వరం ఉపశమనం లభిస్తుంది.
వేడి నీళ్లు తేనె
సీజనల్ వ్యాధుల్నించి రక్షించుకునేందుకే కాకుండా ఎప్పుడైనా సరే చల్లని నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. సాధ్యమైనంతవరకూ గోరు వెచ్చని నీళ్లు తాగడం మంచిది. ముఖ్యంగా వర్షకాలం, చలికాలంలో. ఓ గ్లాసు గోరు వెచ్చని నీటిలో 4 చెంచాల తేనె కలుపుకుని తాగితే పొడి దగ్గు పూర్తిగా తగ్గిపోతుంది. రోజూ కూడా తాగవచ్చు. చాలా రకాల వ్యాధులు దూరమౌతాయి.
అల్లం ఉప్పు
ఆయుర్వేదం ప్రకారం అల్లం అద్భుతమైన ఔషధ గుణాలు కలిగింది. ప్రతి ఇంట్లో అల్లం తప్పకుండా ఉపయోగిస్తారు. జలుబు తగ్గించేందుకు అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. పచ్చి అల్లం తినవచ్చు లేదా అల్లం రసం తాగవచ్చు. కొద్దిగా ఉప్పు తగిలించి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.
Also read: Cholesterol Signs: మీ కాళ్లలో ఈ లక్షణాలు కన్పిస్తే జాగ్రత్త, కొలెస్ట్రాల్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook