Dryness Reasons: ఉన్నట్టుండి నోరెండిపోతుందా, ఈ ప్రమాదకర వ్యాధులు కావచ్చు జాగ్రత్త
Dryness Reasons: నీళ్లు తక్కువ తాగితే సాధారణంగా దాహమేస్తుంటుంది. కొంతమందికి నీళ్లు ఎక్కువ తాగినా దాహం తగ్గకపోవడం లేదా గొంతెండి పోవడం, నోరెండిపోవడం జరుగుతుంటుంది. నోరు ఎండిపోవడం తీవ్రమైన వ్యాధికి సంకేతం.
నీళ్లు తాగడం శరీరానికి చాలా అవసరం. ఎక్కువ సేపు నీళ్లు తాగకుండా ఉంటే గొంతు లేదా నోరు ఎండిపోతుంటుంది. అదే నీళ్లు ఎక్కువ తాగుతున్నా ఇలా జరిగితే మాత్రం తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం..
శరీరంలో జరిగే వివిధ మార్పులు ఎప్పుడూ వివిధ రకాల వ్యాధులకు సంకేతాలు కావచ్చు. శరీరంలో వచ్చే ప్రతి మార్పుకు ఓ నిర్దిష్ట కారణముంటుంది. డ్రైనెస్ లేదా రుచిలో తేడా, గొంతులో గరగర లేదా ఆహారం మింగేటప్పుడు ఇబ్బందులుంటే అప్రమత్తం కావల్సిందే. తరచూ ఇలా జరిగితే నిర్లక్ష్యం వహించకూడదు. నోరు లేదా గొంతు ఎండిపోవడమనేది హై బ్లడ్ షుగర్‌కు సంకేతం కావచ్చు. తరచూ దాహం వేస్తుంటే అది డయాబెటిస్, ఎనీమియా, అల్జీమర్, స్ట్రోక్ వ్యాధులకు కారణం కావచ్చు.
డయాబెటిస్ లక్షణాలు
నోరు ఎండిపోవడం డయాబెటిస్ ప్రధాన లక్షణం. డయాబెటిస్ ఉన్నప్పుడు యూరినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా దాహం ఎక్కువ ఉంటుంది. శరీరంలో నీళ్లు తగ్గినట్టు అన్పిస్తుంది. నోరెండిపోతుంటుంది. అంతేకాకుండా చెమట పట్టడం, ఆకలి ఎక్కువగా వేయడం, తల తిరగడం వంటి లక్షణాలు కన్పిస్తాయి.
ఎనీమియా
ఎనీమియా ఉన్నప్పుడు శరీరంలో రక్త హీనత ఏర్పడుతుంది. దీనివల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఫలితంగా అలసట, తల తిరగడం, చెమట పట్టడం, నోరెండిపోవడం వంటి లక్షణాలు కన్పిస్తాయి.
ప్రెగ్నెన్సీ
ప్రెగ్నెన్సీ సందర్భంగా శరీరంలో బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి. దాంతో యూరిన్ ఎక్కువగా వస్తుంటుంది. ఫలితంగా నోరెండిపోవడం వంటి సమస్య ఏర్పడుతుంది. అందుకే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నీళ్లు ఎక్కువగా తాగాల్సి ఉంటుంది.
నోట్లో లాలాజలం తగ్గినా నోరు లేదా గొంతు ఎండిపోతుంటుంది. టొబాకో, కొన్ని రకాల మందుల వాడకం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. లిక్విడ్ వస్తువులు ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
Also read: Diabetes Control: డయాబెటిస్ నియంత్రణకు డైట్‌లో ఈ తృణధాన్యాలు చేర్చి చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook