Jaggery Benefits: రోజు ఉదయం ఇలా బెల్లం తింటే ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు జీవితంలో రావు!
Jaggery Benefits: తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు బెల్లంతో తయారు ఆహార పదార్థాలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. బెల్లంలో ఉండే ఔషధ గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
Jaggery Benefits: నేటికీ చాలామందికి భోజనం తర్వాత స్వీట్లు తినడం అలవాటు.. పూర్వీకులు ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే కొన్ని స్వీట్లు తినేవారు. ఇప్పటికీ కొందరి ఇళ్లల్లో ఇలాంటి సాంప్రదాయమే కొనసాగుతోంది. కానీ చాలామంది ప్రస్తుతం షుగర్ తో తయారు చేసిన స్వీట్స్ ని ఎక్కువగా తీసుకుంటున్నారు. వీటికి బదులుగా బెల్లంతో తయారుచేసిన స్వీట్ లను తినడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బెల్లంలో లభించే మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ శరీరాన్ని దృఢంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
అంతేకాకుండా సులభంగా జీర్ణక్రియ సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. బెల్లంలో ఉండే ఔషధ గుణాలు పొట్టతోపాటు ఎముకలు, రక్త సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా దూరమవుతాయి. ప్రతిరోజు బెల్లం తినడం వల్ల శరీరానికి కలిగే లాభాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఐరన్ లోపంతో బాధపడుతున్నారా?
ప్రతి 100 గ్రాముల బెల్లంలో 11 మిల్లి గ్రాముల ఐరన్ లభిస్తుంది. కాబట్టి ఐరన్ లోపం సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు బెల్లంతో తయారుచేసిన స్వీట్లు తినడం వల్ల సులభంగా ఉపశమనం పొందుతారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచేందుకు కూడా సహాయపడతాయి.
రక్తపోటును నియంత్రిస్తుంది:
బెల్లంలో ఉండే పొటాషియం, సోడియం రక్తపోటును నియంత్రించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతిరోజు అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారాలలో బెల్లాన్ని వినియోగించాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు రక్త కణాల సంఖ్యను పెంచేందుకు కూడా సహాయపడతాయి. కాబట్టి రక్త సమస్యలతో బాధపడే వారు కూడా ప్రతిరోజు బెల్లాన్ని తీసుకోవచ్చు.
మలబద్ధకం:
మలబద్ధకం సమస్య ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలోనూ వస్తోంది. ఈ సమస్య రావడానికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతిరోజు తీసుకోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు బెల్లాన్ని ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అన్ని రకాల పొట్ట సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది.
జీర్ణక్రియ సమస్యలకు చెక్:
తరచు గా జీవన సమస్యలతో బాధపడే వారికి కూడా బెల్లం ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు సులభంగా జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారంలో బెల్లాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.