Control Diabetes: కాకర చిప్స్‌తో 25 నిమిషాల్లో మధుమేహం మాయం! ఎప్పుడైన ట్రై చేశారా?
Kakarakaya Chips For Diabetes: కాకరకాయతో తయారు చేసిన చిప్స్ ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయిని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్తంలో చక్కెర పరిమాణాలను కూడా నియంత్రిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ చిప్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
Kakarakaya Chips For Diabetes: కాకరకాయ శరీరానికి చాలా మంచిది. ఇందులో చాలా రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇందులో విటమిన్లు B1, B2, B3, C, మెగ్నీషియం, ఫోలేట్, జింక్, ఫాస్పరస్, మాంగనీస్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి మధుమేహం సమస్యలతో బాధపడేవారికి ప్రభావంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మధుమేహాన్ని తగ్గించుకోవడానికి కాకరతో తయారు చేసిన చిప్స్‌ను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ చిప్స్‌ను ఎలా తయారు చేసుకోవాలో, వీటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కాకర చిప్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
✴ 3 కాకరకాయలు
✴ రుచికి సరిపడ ఉప్పు
✴ సరిపడ నూనె
✴ నిమ్మకాయ
✴ 3 నుంచి 4 టీస్పూన్ల నూనె
✴ పసుపు అర టీస్పూన్
✴ ఒక టీస్పూన్ ఎర్ర మిరపకాయ పొడి
✴ 1 టీస్పూన్ శనగపిండి
✴ 2 టీస్పూన్ కార్న్ స్టార్స్
కాకరకాయ చిప్స్ తయారి పద్ధతి:
✦ ముందుగా ఈ చిప్స్ తయారు చేయడానికి కాకరకాయను రౌండ్‌గా కట్ చేయాల్సి ఉంటుంది.
✦ చిన్న బౌల్‌ను తీసుకుని అందులో కాకర ముక్కలను వేసుకోవాల్సి ఉంటుంది.
✦ ఆ తర్వాత 1 టీస్పూన్ ఉప్పు, నిమ్మకాయ రసాన్ని, పిండిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
✦ ఈ ముక్కలను అరగంట పాటు పక్కన పెట్టాల్సి ఉంటుంది.
✦ ఆ తర్వాత పాన్లో కొద్దిగా నూనె వేసి వేడి చేయండి.
✦ తర్వాత అందులోనే కాకరకాయ ముక్కలను వేసి రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది.
✦ ఇలా చేస్తే క్రిస్పీ కాకరకాయ చిప్స్ తయారైనట్లై..
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి